Andhra Pradesh: తాడేపల్లికి చేరిన ‘నగరి’ అసమ్మతి వ్యవహారం.. సీఎం జగన్‌కు మంత్రి రోజా ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వర్గపోరు రోజురోజుకు పెరిగిపోతోంది. మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజవర్గంలో ఇటీవల వైసీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో నగరి నియోజకవర్గ అసమ్మతి వ్యవహారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. ఈ సందర్భంగా తన నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాలపై సీఎం జగన్‌కు మంత్రి రోజా ఫిర్యాదు చేశారు. చక్రపాణిరెడ్డి వర్గం నియోజకవర్గంలో తనను బలహీనపరుస్తోందని ఆమె ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికే మంత్రి రోజా పలుమార్లు విమర్శలు చేశారు. తన నియోజకవర్గంలో తనను పక్కనపెట్టి అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు చక్రపాణిరెడ్డి వర్గంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Lemon Tea: రోజూ లెమన్ టీ తాగితే.. బోలెడు ప్రయోజనాలు
Also Read
- Minister Kolusu Parthasarathy: అభివృద్ధికి అడ్డంకిగా వ్యవహరిస్తున్నారు.. యువతను రౌడీయిజం వైపు ప్రోత్సహిస్తున్నారు..!
- Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సిట్ దర్యాప్తు ముమ్మరం!
- YCP Protest: ఉరవకొండలో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ!
- YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
ఈనెల16న నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలం కొప్పేడులో ఆర్బీకేలు, వెల్నెస్ కేంద్రాలకు చక్రపాణిరెడ్డి వర్గం ప్రారంభోత్సవాలు చేసింది. ఈ అంశంపై ఆవేదన చెందుతూ మంత్రి రోజా ఓ ఆడియో విడుదల చేశారు. తాజాగా ఈ అంశాన్ని సీఎం జగన్ దృష్టికి మంత్రి రోజా తీసుకువెళ్లడంతో నగరి నియోజకవర్గంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఆసక్తి నెలకొంది. 2019 ఎన్నికల తర్వాత తన నియోజకవర్గంలోని శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడమాలపేట జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి, రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ ఛైర్పర్సన్ కేజే శాంతి, నగరి మున్సిపల్ మాజీ ఛైర్మన్ కేజే కుమార్, పుత్తూరుకు చెందిన ఏలుమలై, విజయపురానికి చెందిన లక్ష్మీపతిరాజును మంత్రి రోజా దూరం పెట్టారు. వారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులుగా ముద్రపడ్డారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో వైసీపీ తరఫున కార్యక్రమాలను రెండు వర్గాలు విడిగా చేస్తున్నారు. కొందరు నాయకులు పెద్దిరెడ్డి అండతో పదవులు పొందడం ఈ విభేదాలకు మరింత ఆజ్యం పోసింది. ఒకదశలో మంత్రి పెద్దిరెడ్డి కారణంగా రోజాకు మంత్రి పదవి కూడా రాదని ప్రచారం జరిగింది. కానీ సీఎం జగన్ అనూహ్యంగా రోజాకు కేబినెట్లో బెర్తు ఖరారు చేశారు.
తాజావార్తలు
-
Nani – Nithiin: 20 ఏళ్లలో ఎంత మార్పు.. ఒకప్పుడు నితిన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు అదే హీరోకు నిర్మాతగా!
-
Manu Bhaker: జెన్-జీ ఉద్యమంపై మను భాకర్ కీలక వ్యాఖ్యలు
-
Amazon Sale: అమేజాన్ ‘గ్రేట్ ఫ్రీడమ్ సేల్’లో అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్లపై ఏకంగా రూ.10 వేలు తగ్గింపు..
-
Supreme Court: సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. 498A వర్తింపు.. కానీ, షరతులు వర్తిస్తాయి..!
-
SS Rajamouli: తన సినిమాల్లో బెస్ట్ మూవీ.. పర్సనల్ ఫేవరెట్ ఏదో చెప్పిన రాజమౌళి..
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!