టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు మంత్రి ఆర్ కె రోజా. సీఎం జగన్ ఏ మంచి కార్యక్రమం చేసిన ప్రతిపక్షాలు బూతులా భూతద్దంలో చూపిస్తున్నాయి. కారు మీద పవన్ కల్యాణ్ ఇతరులు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా వచ్చి ఎలా హాడావుడి చేశారో చూశాం. ఇప్పటంలో అన్యాయం జరిగిందన్నారు. తప్పుడు సమాచారంతో కోర్టుకు వెళ్ళినందుకు కోర్టు చివాట్లు పెట్టిందన్నారు. రిషి కొండలో టూరిజం ఉంది. కోర్టు ఉత్తర్వులు మేరకే రిషి కొండలో నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు రోజా.
Read Also: The India Box Office Report-October: వెండి తెరను మురిపించి.. మెరిపించిన సం‘చలన’ చిత్రం..
రిషి కొండపై ప్రతి ప్రతిపక్షాలు చేసేది తప్పుడు ప్రచారం అని తేలిపోయింది. అమరావతి ముద్దు.. మూడురాజధానులు వద్దు అంటూ అమరావతి రైతుల ముసుగులో పాదయాత్ర చేశారు. కోర్టు ఐడెంటిటీ కార్డులతో పాదయాత్ర చేయమనగానే పాదయాత్ర ఆగిపోయింది. రైతులు కాని వారు పాదయాత్రలో పాల్గొన్నారు. పప్పు నాన్న సీఎం గా ఉన్నప్పుడే మంగళగిరి నుంచి ఎమ్మెల్యే గా గెలవలేక పోయాడు. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందుకు వెళ్ళి తొడ కొడితే కోసి కూర వండుతారని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ఆన్ లో ఉంటాడు. రాష్ట్రంలో పర్యటించడానికి వాహనం రెడీ అవుతుంది. డీజిల్ కూడా ఉంటుంది. ఆయన పాదయాత్ర చేస్తే రాష్ట్ర ప్రజలకి క్లారిటీ వస్తుందన్నారు మంత్రి రోజా.
Read Also: The India Box Office Report-October: వెండి తెరను మురిపించి.. మెరిపించిన సం‘చలన’ చిత్రం..