ఏపీలో సీఎం జగన్ తో సమావేశం కానుంది మంత్రుల కమిటీ. పీఆర్సీ అంశాలు, ఉద్యోగుల నిరసనలపై చర్చించనుంది. క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు మంత్రి పేర్ని నాని. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఇవాళ ఉద్యోగ సంఘాలతో జరిపే చర్చలు ఉద్యోగులకి సంతృప్తినిచ్చే విధంగానే ఉంటాయని భావిస్తున్నా అన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం ఉద్యమాన్ని విరమించుకుంటారని ఆశిస్తున్నా అన్నారు పేర్ని నాని. అనేక అంశాలపై ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాం.ఆర్థికపరమైన విషయాలపై ప్రభుత్వంలో అంతర్గతంగా చర్చించుకుని…