Minister Nara Lokesh: ఏపీ సీఫుడ్ పరిశ్రమ నెట్వర్కింగ్ కి సహకారం అందించండి
- సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ..
- ఏపీ సీఫుడ్ పరిశ్రమ నెట్వర్కింగ్ కి సహకారం అందించండి..
- ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంపుదలకు కలిసి పని చేయండి: మంత్రి లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో బిజీబిజీగా ఉన్నారు. సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా (SIA) ప్రతినిధులు, ఆ సంస్థ సీఈవో వెరోనికా పాపకోస్టా, ఎస్ఐఏ ఎంగేజ్ మెంట్ మేనేజర్ జాస్మిన్ కెల్లేలతో భేటీ అయ్యారు. 2017 నుంచి ప్రారంభమైన SIAలో ఆస్ట్రేలియాలోని వైల్డ్ క్యాచ్, ఆక్వా కల్చర్, సీఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన 30 వేలకు పైగా వ్యాపారులు సభ్యులుగా ఉన్నారన్న ప్రతినిధులు.. తమ సంస్థ ప్రతి ఏటా ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థకు AUD 3.5 బిలియన్ విలువైన వాటాను అందిస్తోందన్నారు. బయో సెక్యూరిటీ, ఎగుమతి పని తీరును మెరుగు పర్చేందుకు ప్రభుత్వ, పరిశోధనా సంస్థలతో కలిసి పని చేస్తున్నట్లు ఎస్ఐఏ ప్రతినిధులు వెల్లడించారు.
Read Also: Tension in Tenali: చంద్రబాబు కాలనీలో ఉద్రిక్తత- చిన్నపిల్లల గొడవతో కుటుంబంపై దాడి
Also Read
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
ఇక, మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ భారత్ లో అగ్రగామిగా ఉంది.. దేశం మొత్తం మీద ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీ 60 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది.. 2024-25లో $7.4 బిలియన్ డాలర్ల (రూ.66 వేల కోట్లు) విలువైన 16.98 మిలియన్ టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఏపీ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యాయి.. ఆస్ట్రేలియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులతో ఆంధ్రప్రదేశ్ సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులను అనుసంధానించేందుకు ట్రేడ్ మిషన్లు, నెట్‌వర్కింగ్ కార్యక్రమాలను చేపట్టాలి అని కోరారు. భారత సముద్ర ఉత్పత్తుల మార్కెట్ విస్తరణ కోసం ఏపీ ఆక్వా పరిశ్రమదారులు, ఆస్ట్రేలియా దిగుమతి దారుల మధ్య భాగస్వామ్యాలను సులభతరం చేయాలని నారా లోకేష్ పేర్కొన్నారు.
Read Also: Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
అయితే, ఆక్వా ఉత్పత్తుల నాణ్యత, నిల్వ కాలాన్ని పెంచేందుకు ప్రాసెసింగ్, కోల్డ్ చైన్ మేనేజ్ మెంట్, ప్యాకేజింగ్ రంగాల్లో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను పరిచయం చేయాల్సిన అవసరం ఉందని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. పర్యావరణ ప్రభావాన్ని తగ్గిస్తూ ఉత్పాదకతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌లో స్థిరమైన ఆక్వా కల్చర్, మత్స్య సంపద నిర్వహణకు ఏపీ ఆక్వా పరిశ్రమదారులతో కలిసి నైపుణ్యాన్ని పంచుకోండీ అని కోరారు. రాష్ట్రంలో సీఫుడ్ వంటకాలను ప్రోత్సహించి, కలినరీ టూరిజంను ఆకర్షించేందుకు సంయుక్త కార్యక్రమాలు చేపట్టండి మంత్రి లోకేష్ అన్నారు.
తాజావార్తలు
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!