Nara Lokesh: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యులపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా తన తల్లినీ అవమానించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు వైఎస్ షర్మిలను, వైఎస్ విజయమ్మను కూడా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమాన కరంగా మాట్లాడుతున్నారు అని మంత్రి వ్యాఖ్యానించారు. అవమానకర రీతిలో మాట్లాడిన నాయకులను తమ పార్టీ సమర్ధించడం లేదనీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సమాధానం ఇచ్చారు. సమర్ధించకపోతే అవమానకర రీతిలో మాట్లాడిన వాళ్లకు, టికెట్లు ఎందుకు ఇచ్చారని లోకేష్ ప్రశ్నించారు. సభ బడ్జెట్ పై చర్చ జరపాలి కానీ.. ఇతర కార్యక్రమాలతో సభ సమయాన్ని వృథా చేయవద్దని చైర్మన్ మోషేను రాజు సూచించారు.
Read Also:AUS vs IND: సచిన్‌ను తీసుకోండి.. బీసీసీఐకి రామన్ సూచన!
కాగా, అంతకు ముందు.. మండలిలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు వైఎస్ జగన్ అసెంబ్లీ రాకుండా పారిపోయరని విమర్శించారు. అయితే, తమ అధినేత ప్రస్తావన తెచ్చి విమర్శలు చేయడంపై మంత్రి డోలాపై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. అయితే, వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు రెండేళ్లు సభలో పోరాడారని పేర్కొన్నారు. నా తల్లిని అవమానపరడంతోనే సభ నుంచి ఛాలెంజ్చేసి వెళ్లిపోయరని గుర్తు చేశారు. చంద్రబాబు సభకు రాకపోయినా మా ఎమ్మెల్యేలు సభకు వచ్చారని మంత్రి తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి రావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.