AUS vs IND: సచిన్‌ను తీసుకోండి.. బీసీసీఐకి రామన్ సూచన!
- నవంబర్ 22 నుంచి తొలి టెస్ట్
- ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీ
- టెండూల్కర్‌తో పాఠాలు చెప్పించాలంటున్న రామన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే ఆసీస్ గడ్డకు చేరుకుని సాధన కూడా షురూ చేసింది. గత రెండు పర్యాయాలు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సాధించిన భారత్.. హ్యాట్రిక్‌పై గురి పెట్టింది. అయితే స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు పెద్దగా ఫామ్‌లో లేకపోవడం జట్టుకు కలవరపాటుకు గురిచేస్తోంది. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఈ ఇద్దరే కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది.
రోహిత్ శర్మ అడపాదడపా ఆడుతున్నా.. విరాట్ కోహ్లీ మాత్రం ఇటీవల చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. విరాట్ ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడితే చెలరేగిపోవడం ఖాయమని క్రికెట్ అభిమానులు అంటున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో బ్యాటింగ్ పాఠాలు చెప్పించాలని భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ బీసీసీఐకి సూచించాడు. ఈ సిరీస్ కోసం కన్సల్టెంట్‌గా సచిన్‌ను నియమించుకోవాలన్నాడు. ఈ రోజుల్లో కన్సల్టెంట్‌ల నియామకం సర్వసాధారణం అని రామన్ పేర్కొన్నాడు.
Also Read
Also Read: Rohit Sharma: అందరి తండ్రుల మాదిరిగానే రోహిత్!
‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 కోసం భారత్ జట్టు ఆస్ట్రేలియాలో ఉంది. టీమిండియాకు ప్రయోజనం చేకూరాలంటే నాదొక సూచన. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సేవలను బీసీసీఐ వినియోగించుకోవాలి. ఆసీస్ టెస్ట్ సిరీస్ కోసం బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా సచిన్‌ను నియమించాలి. తొలి టెస్టు, రెండో టెస్టుకు చాలా సమయం ఉంది. ఈ రోజుల్లో కన్సల్టెంట్‌ల నియామకం సర్వసాధారణం. నేను చెప్పింది ఓసారి బీసీసీఐ ఆలోచన చేయాలి’ అని డబ్ల్యూవీ రామన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఆస్ట్రేలియాపై 39 టెస్టులు ఆడిన సచిన్ 3,630 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై 20 టెస్టులలో 1,809 రన్స్ బాదాడు. గతంలో ఇంగ్లండ్ పర్యటనకు ముందు కోహ్లీ ఇబ్బందిపడగా.. సచిన్ సలహాలతో రాణించాడు.
తాజావార్తలు
-
Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?