Jogi Ramesh: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై మండిపడ్డారు మంత్రి జోగి రమేష్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం వైఎస్ జగన్‌ని చూస్తేనే నారా లోకేష్ కి ఫ్యాంటు తడిచి పోతుంది.. అలాంటి లోకేష్ చిటికేస్తే ఏదైనా జరుగుతుందని విర్రవీగుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, మా పథకాలన్నీ ప్రజల దీవెనలు పొందాయి.. అందుకే ధైర్యంగా జనం దగ్గరకు వెళ్తున్నామన్న ఆయన.. మరి మేం ఫెయిల్ అయ్యింది ఎక్కడ? అని ప్రశ్నించారు. 2 లక్షల కోట్ల రూపాయాలు బటన్ నొక్కి నేరుగా ప్రజలకే సీఎం వైఎస్ జగన్ అందించారని ప్రశంసలు కురిపించిన ఆయన.. ఇలాంటి సీఎం ప్రపంచంలోనే లేరన్నారు.. సామాజిక న్యాయం కూడా జగనే చేసి చూపించారు.. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశంలో బీసీల పై చర్చకు సిద్దమా? అంటూ సవాల్ విసిరారు.
Read Also: MP Avinash Reddy: వాస్తవాలు లక్ష్యంగా కాదు.. వ్యక్తి లక్ష్యంగా సీబీఐ విచారణ..
బీసీలకు ఎవరేం చేశారో చర్చకు రావాలి.. ఇదే నా సవాల్ అన్నారు మంత్రి జోగి రమేష్.. బీసీలను చంద్రబాబు బానిసలుగా చేస్తే, జగన్ బలవంతులను చేశారన్న ఆయన.. రాజ్యసభ, మండలి మెట్లు సీఎం వైఎస్ జగన్ వల్లే మావాళ్లు ఎక్కగలిగారన్నారు.. చర్చకు రమ్మంటే నేను చంద్రబాబు ఇంటికే వెళ్లా.. కానీ, ఆయన కరకట్ట వదిలి పారిపోయాడు అంటూ గతంలో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ సెటైర్లు వేశారు.. ఇక, ఇప్పుడు కొట్టుకోవడానికి లగ్నం పెడతాడంట, మేం వెళ్లాలం.. ఆ మాట అనటానికి చంద్రబాబుకు సిగ్గు ఉండాలి కదా? అంటూ మండిపడ్డారు.. చేతనైతే అసెంబ్లీలో ఎన్ని గంటలైనా చర్చ చేయటానికి మేం సిద్ధమని ప్రకటించారు. మరోవైపు మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వాస్తవాలు బయటకు రావాలన్నారు మంత్రి జోగి రమేష్.