NTV Telugu Site icon

Jogi Ramesh: చంద్రబాబుపై మంత్రి ఘాటు వ్యాఖ్యలు.. పవన్‌ను కూడా ఏకిపారేశాడు..!

Jogi Ramesh

Jogi Ramesh

చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు మంత్రి జోగి రమేష్‌.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు బట్టలు ఊడదీసి కొడతాను అంటున్నాడు.. ప్రజలు గత ఎన్నికల్లో నీ బట్టలు ఊడదీసి కొట్టబట్టే కదా రోడ్డున పడ్డావు అంటూ సెటైర్లు వేశారు.. ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంత దిగజారి మాట్లాడటం ఎప్పుడైనా చూశామా? రాయలసీమ ప్రజల మనోభావాలను మంటగలిపే విధంగా మాట్లాడటం కరెక్టేనా? అంటూ ప్రశ్నించారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఏమీ చేయలేని చవట సన్నాసి చంద్రబాబు నాయుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు ఏం మారుస్తాడు? గోంగూర? అని ఎద్దేవా చేశారు. టీడీపీ పార్టీ నాది.. నేనే పెట్టాను.. అని చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని నిలదీశారు.

Read Also: JanaSena: అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు జనసేన సాయం..

ఇక, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గురించి, సీఎం వైఎస్‌ జగన్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు మంత్రి జోగి రమేష్‌.. ఎంగిలి మెతుకులకు ఆశ పడే కుక్క చంద్రబాబు.. ఏ పార్టీ సంకనాకాలా అని చూస్తూ ఉంటాడు అంటూ ఫైర్‌ అయ్యారు. ఎన్నికలు రాగానే వస్తారు.. వీళ్లందరూ కలిసినా వైసీపీని ఇంచ్ కూడా కదిలించలేరని సవాల్‌ చేశారు.. మరోవైపు.. పవన్‌ కల్యాణ్‌పై మరింత డోస్‌ పెంచారు జోగి రమేష్.. పవన్ కల్యాణ్‌ సైకో గాడు.. అతని సైకో సేనలు అర్ధరాత్రిలో తిరుగుతూ కటౌట్లు తగుల బెడుతున్నారు అని ఫైర్‌ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో నోరు పారేసుకుని విర్రవీగే టీడీపీ నేతలు అందరూ ఇంటికి వెళ్లటం ఖాయం అని జోస్యం చెప్పారు మంత్రి జోగి రమేష్.. కాగా, కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతోన్న విషయం విదితమే.

Show comments