Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Gudivada Amarnath Sensational Allegations On Chandrababu

Minister Gudivada Amarnath: అమరావతి నిర్మాణం పేరుతో బాబు లూటీ..!

Published Date :March 24, 2023 , 10:44 pm
By Sudhakar Ravula
Minister Gudivada Amarnath: అమరావతి నిర్మాణం పేరుతో బాబు లూటీ..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Minister Gudivada Amarnath: అమరావతి నిర్మాణం పేరుతో చంద్రబాబు లూటీ చేశారని ఆరోపించారు మంత్రి అమర్నాథ్.. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు అవినీతి వ్యవహారంపై శాసనసభలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. స్లైడ్స్, పీపీటీతో సహా వివరించారు.. అమరావతిలో కట్టింది గోరంత.. కొట్టేసింది కొండంత.. ఈ కేడీని ఏ ఈడీ పట్టుకోలేదు అనుకుంటున్నాడు.. కానీ, చంద్రబాబుపై విచారణ తప్పదు అంటూ హెచ్చరించారు.. దోపిడికి కూడా చంద్రబాబు కోడ్‌ లాంగ్వేజ్‌.. ఒక టన్ను అంటే కోటి రూపాయలు.. ఏ అవకాశాన్నీ వదలకుండా ప్రజాధనం లూటీ చేశారు.. సెక్రటేరియట్, అసెంబ్లీ, కోర్టు నిర్మాణాలు వదల్లేదు అన్నారు. ఐటీ రైడ్స్‌లో లెక్క తేలని రూ.2 వేల కోట్లు బట్టబయలు అయ్యాయి.. ఈ విషయాన్ని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ ప్రకటించిందన్నారు. ఇవి ఐటీ శాఖ నివేదికలో వెల్లడైన పచ్చి నిజాలు అని పేర్కొన్నారు.

సంక్షోభంలోనూ బాబు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు మంత్రి అమర్నాథ్‌.. ఐటీ శాఖ దేశంలో పలుచోట్ల జరిపిన దాడుల ఫలితంగా రాష్ట్రంలో ప్రజాధనం ఏ విధంగా లూటీ అయ్యిందనేది స్పష్టంగా తెలిసి వచ్చింది. గత ప్రభుత్వంలో సీఎం చంద్రబాబునాయుడు ఏ రకంగా ప్రజా ధనాన్ని దోచుకున్నాడో పత్రికల్లో రోజూ కథనాలు వస్తున్నాయి. ఆ అవినీతిపై, దోచుకు తినడంలో చంద్రబాబు చూపిన నైపుణ్యాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. రాష్ట్ర విభజన లాంటి సంక్షోభంలోనూ చంద్రబాబు అవకాశాలు వెతుక్కుని ప్రజాధనం లూటీ చేశాడు. ఐటీ రైడ్స్‌లో చాలా విషయాలు బయటపడ్డాయి. దానికి సంబంధించి ఆంగ్ల పత్రికలలో ఆర్టికల్స్ వచ్చాయి.. చంద్రబాబుపై విచారణ చేపడుతున్నారని అందులో రాశారు. సచివాలయం, అసెంబ్లీ, న్యాయస్థానాల నిర్మాణాల్లోనూ చంద్రబాబు దోచుకు తిన్నాడు. 2020 ఫిబ్రవరిలో చంద్రబాబునాయుడి మాజీ పర్సనల్‌ సెక్రటరీ ఇంట్లో ఐటీ రైడ్స్‌ జరిగాయి. ఆ మేరకు ఫిబ్రవరి 13, 2020లో ప్రెస్‌ రిలీజ్‌ కూడా ఇచ్చారు. రైడ్స్‌లో రూ. 2 వేల కోట్లు దొరికినట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ ప్రెస్‌ రిలీజ్‌లో స్పష్టం చేసింది. 40 చోట్ల తనిఖీలు చేసినట్లు, వాటిలో బోగస్‌ సబ్‌ కాంట్రాక్టులు, ఇన్వాయిస్‌లు, బిల్లులు ఇతర ఆధారాలు లభించాయని, ఇంకా ఒక ప్రామినెంట్‌ పర్సన్‌ పర్సనల్‌ సెక్రటరీ వద్ద ఆధారాలు దొరికాయని చెప్పారు గుడివాడ అమర్నాథ్.

Also Read

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
  • CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్‌ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
  • Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
  • Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
Add as a preferred
source on google

ఇక, చంద్రబాబుకి 2022 సెప్టెంబర్‌ 28న ఇన్‌కం టాక్స్‌ నోటీసులు కూడా ఇచ్చిందన్నారు మంత్రి అమర్నాథ్‌.. ఆయన జీతాలను మాత్రమే ఇన్‌కం టాక్స్‌కి చూపిస్తున్నారు తప్ప మిగిలినవి చూపడం లేదని వారు పేర్కొన్నారు. ఈ కేసును డీసీఏసీ–సెంట్రల్‌ సర్కిల్‌కి షిఫ్ట్‌ చేస్తున్నాం అని కూడా నోటీసులో పేర్కొన్నారు. దీని ఆధారంగా చంద్రబాబును భవిష్యత్తులో విచారణకు కూడా పిలుస్తారు. 2019లో మొదలైన ఇన్‌కం టాక్స్‌ రైడ్స్‌ చంద్రబాబుకు నోటీసులు వరకూ సాగాయన్నారు.. మరోవైపు ఎన్నికల ఫండ్‌ కోసం షెల్‌ కంపెనీలు సృష్టించారని ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి పలువురిని విచారించి ఇన్‌కం టాక్స్‌ ఒక నివేదిక కూడా తయారు చేసింది. నివేదికలో కీలకంగా డబ్బు చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీకి డెలివరీ అనే అంశాన్ని ప్రస్తావించారు. దీనిలో కీలకంగా మనోజ్‌ వాసుదేవ్‌ పార్ధసానీ అనే వ్యక్తి నిలుస్తున్నాడు. ఇతను షాపోజీ పల్లంజి అనే నిర్మాణ సంస్థకు సంబంధించిన వ్యక్తి.. ఈయనతో చంద్రబాబుకు 2017లో పరిచయం మొదలైంది. ఆ తర్వాత 2019 ఫిబ్రవరిలో నేరుగా ఇద్దరూ చంద్రబాబు ఇంట్లోనే మాట్లాడుకున్నారు.. అప్పుడు మాకు ఎన్నికలు వస్తున్నాయి.. దానికి ఖర్చులు ఉన్నాయి.. డబ్బు కావాలని చంద్రబాబు అడిగారని.. తన పీఎస్‌ శ్రీనివాస్‌ అనే వ్యక్తి చెప్పినట్లుగా చేయాలని చంద్రబాబు మనోజ్‌ వాసుదేవ్‌కి చెప్పాడు. ఇదంతా ఈ కేసులో జరిగిన విచారణకు సంబంధించిన రిపోర్ట్‌ అంటూ అసెంబ్లీ చదివి వినిపించారు అమర్నాథ్‌.

చంద్రబాబుకు చిన్నప్పుడు చదువుకునే రోజుల నుంచి మనుషులు, వ్యవస్థలను మేనేజ్‌ చేయడం అలవాటు. అందులో ఆయన దిట్ట అంటూ ఆరోపించారు మంత్రి అమర్‌నాథ్‌.. గత ప్రభుత్వ హయాంలో 2018, డిసెంబర్‌ నాటికి షాపోజీ పల్లంజీ సంస్థకు మొత్తం రూ.8 వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్‌లు ఇచ్చారు. కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇళ్ల నిర్మాణం పనులు కూడా అప్పగించారు. టిడ్కో ఇళ్లకు సంబంధించి రూ.7 వేల కోట్లు, అమరావతిలో పలు నిర్మాణాలకు సంబంధించి మరో రూ.700 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇచ్చారు. అందుకే, ఎన్నికల సమయానికి రూ.100 కోట్లు పార్టీ ఫండ్‌ కింద చంద్రబాబు పీఎస్‌ అడిగినట్లు మనోజ్‌ వాసుదేవ్‌ స్పష్టం చేశారని తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌తో పాటు లోకేశ్‌ పీఏ రాజేశ్‌ కిలారి అనే వ్యక్తి కూడా ఉన్నారు.. శ్రీనివాస్‌ విక్కీ జైన్, వినయ్‌ నంగాలియా అనే ఇద్దరు వ్యక్తులను మనోజ్‌కి ఎటాచ్‌ చేశాడు.. విక్కీ జైన్, వినయ్‌ నంగాలియా అనే వ్యక్తుల పేర్ల మీద ఉన్న బోగస్‌ ఇన్వాయిస్‌లను రెయిజ్‌ చేసి రూ.52.5 కోట్లు, రూ.62.90 కోట్లు బదిలీ చేశారు.. అతుల్‌ సోనీ అనే ఎల్‌ అండ్‌ టీ ప్రతినిధిని కూడా మనోజ్‌కి ఎటాచ్‌ చేశారు.. అప్పట్లో ఎల్‌ అండ్‌ టీ కూడా సీఆర్‌డీఏలో కొన్ని పనులు చేపట్టింది. ఈ అతుల్‌ సోనీ అనే వ్యక్తికి రూ.41.90 కోట్లు బదిలీ చేశారు. ఈ డబ్బంతా బోగస్‌ ఓచర్ల ద్వారా ఆర్వీఆర్‌ రఘు, కృష్ణ, నారాయణ్, శ్రీకాంత్, అనికడ్‌ బలోటాలకు బదిలీ చేశారు అని ఆరోపించారు.. ఆర్వీఆర్‌ రఘు అనే వ్యక్తి రామోజీరావు కొడుకు కిరణ్‌ వియ్యంకుడు.. ఇదంతా డీపీటీ(దోచుకో.. పంచుకో.. తినుకో..) బ్యాచ్‌ కాబట్టి అందరికీ వాటాలు అందించారని పేర్కొన్నారు.

ఇవి కాకుండా దీరమ్స్‌లో కూడా దుబాయ్‌లో రూ.15.14 కోట్లు చంద్రబాబుకు అందించారు అని విమర్శించారు గుడివాడ అమర్నాథ్.. మొత్తం కలిపి రూ.143 కోట్లు ఇలా చేతులు మారింది.. దీనిలో సబ్‌ కాంట్రాక్టర్లుగా చూపిన కంపెనీలు ఏవీ పనులు చేయలేదు.. ఈ డబ్బును షెల్‌ కంపెనీలను చూపి దోచుకున్నారు. దాంట్లో చంద్రబాబునాయుడు స్కిల్‌ ఎక్కువగా ఉంది. వివిధ రూపాల్లో బదిలీ చేసిన డబ్బంతా చివరిగా పీఏ శ్రీనివాస్‌కు చేరిందని మనోజ్‌ వాసుదేవ్‌ స్పష్టంగా విచారణలో తెలిపాడు. చేతులు మారిన మొత్తం డబ్బులో రూ.24.90 కోట్లు నిరంజన్‌కి, రూ.3.50 కోట్లు శ్రీనాథ్, రూ.1.82 కోట్లు బెంగుళూరులోని శేఖర్, రూ.4.60 కోట్లు నారాయణ్, రూ.16.51 బెంగుళూరులోని రాజా, రూ.2.7 కోట్లు టీకాస్ట్, రూ.13 కోట్లు అంతా కలిపి రూ.76.09 కోట్లు చెల్లించారని పేర్కొన్నారు. ఇదంతా చంద్రబాబునాయుడు పీఎస్‌ శ్రీనివాస్‌ ద్వారానే జరిగింది. ఆర్వీఆర్‌ రఘు అనే వ్యక్తి వాట్సాప్‌ చాట్‌లో నారాయణ్‌ అనే వ్యక్తి వస్తున్నాడని ఉంది. ఆర్వీఆర్‌ రఘు అనే వ్యక్తి చంద్రబాబునాయుడికి చాలా క్లోజ్‌ అని కూడా విచారణలో చెప్పారు. ఈ డబ్బంతా చంద్రబాబునాయుడికి అందించడంలో పీఎస్‌ శ్రీనివాస్‌ కీలకపాత్ర పోషించాడని ఆ నివేదికలో పేర్కొన్నారు. దాడులు జరుగుతున్న సందర్భంలో శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఈ విషయాలు చెప్పడానికి నిరాకరించాడు. ఆ తర్వాత ఇన్‌కం ట్యాక్సు అధికారులు ఆధారాలను సేకరించి అతని ముందు పెట్టారు. మనోజ్‌ వాసుదేవ్‌ అనే వ్యక్తితో శ్రీనివాస్‌ చేసిన చాటింగ్‌ ఆధారాలు చూపడంతో ఒప్పుకున్నాడు. రాజేశ్‌ కిలారు అనేవ్యక్తికి రూ.4.5 కోట్లు అందించినట్లు తేలింది. ఈ రాజేశ్‌ కిలారు అనే వ్యక్తి నారా లోకేశ్‌కి పర్సనల్‌ సెక్రటరీ కూడా అని చెప్పుకొచ్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • chandrababu
  • CM YS Jagan
  • Minister Gudivada Amarnath
  • tdp

తాజావార్తలు

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?

  • RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..

  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions