NTV Telugu Site icon

Bala Veeranjaneya Swami: వాళ్ల దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది..

Dola

Dola

Bala Veeranjaneya Swami: పేర్ని నాని, వైఎస్ జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే రాష్ట్రం సర్వ నాశనం అవుతుంది అని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వాళ్ల లాగా 11 సీట్లకు పరిమితం కావాల్సిన అవసరం మాకు లేదు.. పేర్ని నాని భార్య గోడౌన్ లో రేషన్ బియ్యం మాయమయ్యాయి.. వాళ్లు చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.. కక్ష సాధింపు చర్యలకు మేం పాల్పడటం లేదు.. రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టి సారించాం.. 1, 348 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విడుదల చేశామన్నారు. 4 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు జగన్ పెట్టాడు.. జగన్ పెట్టిన బకాయిలు, జగన్ పెంచిన విద్యుత్ చార్జీలపై ఆయనే ధర్నా చేశారు.. జగన్ ప్రభుత్వంలో సరికొత్త రికార్డులు సృష్టించారు అని మంత్రి వీరంజనేయ స్వామి పేర్కొన్నారు.

Read Also: Hamas-Israel: హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. ఇంటెలిజెన్స్ చీఫ్ ఒసామా హతం

ఇక, సూపర్ సిక్స్ పథకాలు వరుసగా అమలు చేస్తున్నామని మంత్రి డోలా అన్నారు. వైసీపీ నాయకులు ఎన్ని అసత్యాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఒక్కరు కూడా కనపడలేదు.. కానీ, అసెంబ్లీ హాజరు పట్టికలో సంతకాలు మాత్రం పెట్టారు.. వరుసగా 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకపోతే పదవులు పోతాయని సంతకాలు పెట్టారు.. అసెంబ్లీలోకి రాకపోతే.. రానీ వారి లెక్క ఉంటుంది అని చెప్పుకొచ్చారు.