Dharmana Prasad Rao: రాజీనామాకు సిద్ధపడ్డ మంత్రి ధర్మాన.. వారించిన సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmana Prasad Rao: ఏపీలో వికేంద్రీకరణ అంశంపై రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రను అధికార పార్టీ నేతలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల అంశంపై అధికార పార్టీలో కీలక సంకేతాలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ సాధన ఉద్యమం కోసం రాజీనామా చేస్తానని సీఎం జగన్ వద్ద ప్రస్తావించారు. విశాఖ రాజధాని ఉద్యమం చురుగ్గా, చైతన్యవంతంగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకుంటానని ఆయన వివరించారు. ఉత్తరాంధ్ర ప్రజల అభిలాషను నెరవేర్చడం కన్నా మంత్రి పదవి గొప్పది కాదని ధర్మాన అభిప్రాయపడ్డారు. దీంతో తన రాజీనామాను అనుమతించాలని కోరారు.
అయితే రాజీనామాకు సిద్ధపడ్డ మంత్రి ధర్మాన ప్రసాదరావును సీఎం జగన్ వారించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయమని ధర్మానకు సీఎం జగన్ స్పష్టం చేశారు. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకూ పంచుతూ, వికేంద్రీకరణ చేపడదామని, సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ విధానమని జగన్ తెలియజేశారు. మూడు ప్రాంతాలకు సమన్యాయమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అటు ఇప్పటికే విశాఖ రాజధాని కోసం విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ధర్మాన కూడా రాజీనామా చేస్తానని చెప్పడంతో మున్ముందు ఇంకా ఎంతమంది ఉత్తరాంధ్ర నేతలు రాజీనామాలకు సిద్ధపడతారో వేచి చూడాల్సిందే.
Also Read
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
- Off The Record : మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు ?
- Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
Read Also: Ambedkar Konaseema: అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు.. ఐడీ కార్డు ఉంటేనే అనుమతి
మరోవైపు ఇటీవల మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఉత్తరాంధ్రపై ప్రేమ ఉంటే ఆక్రమించిన భూములను పేదలకు పంచాలని పవన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై శుక్రవారం సీఎం జగన్‌కు మంత్రి ధర్మాన ప్రసాదరావు వివరణ ఇచ్చారు. భూ ఆక్రమణలకు సంబంధించి సిట్ నివేదికలోని పలు అంశాలను ప్రస్తావించారు. భూ ఆక్రమణలకు సంబంధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనపై చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని సీఎం జగన్‌కు తెలిపారు.
తాజావార్తలు
-
PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్‌లో ‘పెద్ది’ దిగుతున్నాడు!
-
CM Vijay: సీఎం విజయ్‌కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!