Site icon NTV Telugu

Dadisetti Raja: పవన్ కళ్యాణ్ హవాలా చేస్తూ దొరికిపోయాడు

Dadisetti Raja

Dadisetti Raja

Dadisetti Raja: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి దాడిశెట్టి రాజా సంచలన ఆరోపణలు చేశారు. రూ.1800 కోట్లు పోలాండ్‌కు హవాలా చేస్తూ సాక్ష్యాధారాలతో పవన్ కళ్యాణ్ కేంద్రం చేతికి చిక్కాడని ప్రచారం జరుగుతోందని.. రెండు మూడు నెలల నుంచి ఈ ప్రచారం సాగుతోందని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. పవన్ కళ్యాణ్ మాటలకు పిల్లలు చేయకూడని పనులు చేసి కేసుల్లో ఇరుక్కుంటే బాధ్యత ఆయన వహిస్తాడా అని నిలదీశారు. 2014-19 మధ్య జనసేన, టీడీపీ ప్రభుత్వంలో అత్యధికంగా కాపులపై కేసులు పెట్టారని.. ఈ విషయాన్ని కాపులు మర్చిపోలేదన్నారు. చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలు మర్చిపోలేదు. పవన్ తాపత్రయం అంతా చంద్రబాబు కోసమే అని ఆరోపించారు. మంత్రులపై ఇష్టారాజ్యంగా పవన్ మాట్లాడుతున్నాడని.. కాపు సామాజికవర్గ నేతలే టార్గెట్‌గా పవన్ విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు.

Read Also: Gudivada Amarnath: PSPK అంటే ప్యాకేజ్‌స్టార్ పవన్ కళ్యాణ్

ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని.. పీకలు పిసికేస్తావా అని పవన్ కళ్యాణ్‌ను మంత్రి దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. ఎంతమంది కలిసినా జగన్‌ను ఎదుర్కోవడం కష్టమన్నారు. కాపు సామాజిక వర్గం అంతా పవన్ జోకర్ బ్రోకర్ చేష్టలు గమనిస్తోందన్నారు. మీటింగ్‌కు వచ్చే పిల్లలను అసాంఘిక శక్తులుగా తయారుచేయవద్దని మంత్రి దాడిశెట్టి రాజా సూచించారు. సంక్షేమాన్ని పవన్ తక్కువ చేసి మాట్లాడుతున్నాడని.. మరి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. 2014-19 మధ్య రాష్ట్రానికి ఏడాదికి సగటున 11 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. కరోనా ఉన్నా జగన్ వచ్చినప్పటి నుంచి ఏడాదికి సగటున 15వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి దాడిశెట్టి రాజా వివరించారు. చంద్రబాబుతో కలిసి ప్యాకేజీ పెంచటం గురించి, అల్లర్లు పెంచాలని మాట్లాడుతున్నాడన్నారు. భీమ్లా నాయక్ సినిమా వల్ల 30 కోట్లు నష్టపోయానని పవన్ చెప్తున్నాడని.. సినిమా ప్రొడక్షనే రూ.20 కోట్లు దాటలేదని.. అప్పుడు రూ.30 కోట్ల నష్టం ఎలా వస్తుందని నిలదీశారు. నాసిరకం సినిమా తీసి ప్రజలు చూడకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందని మండిపడ్డారు. తక్కువ బడ్జెట్‌లో తీసిన కాంతార సినిమా ఏ రకంగా హిట్ అయ్యిందో అందరూ చూశారన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ యజమాని చంద్రబాబు కాపులను పవన్‌కు అప్పగించాడని.. ఇలాంటి శునకాలు చంద్రబాబు దగ్గర చాలానే ఉన్నాయని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. పవన్ కళ్యాణ్ భాష అదుపులో పెట్టుకోవాలని సూచించారు. కులాల వారీ రిజర్వేషన్లు లేనప్పుడు ఒక వర్గానికి ఎలా ఇస్తారని నిలదీశారు. కేంద్రం కులాల వారీగా రిజర్వేషన్లు ఇవ్వొచ్చు అని అనుమతిస్తే ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆర్ధిక వెనుకబాటు అనే అంశాన్ని తీసుకుంటే కాపులకు 7 శాతం రిజర్వేషన్లు వస్తాయన్నారు. ఐదు శాతం రిజర్వేషన్ వల్ల కాపుల ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలిపారు. వైఎస్ఆర్ పేరు ఎత్తే అర్హత పవన్ కళ్యాణ్‌కు లేదన్నారు. వైఎస్ఆర్ దెబ్బకు ప్రజారాజ్యం పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని.. ఇప్పుడు జగన్ దెబ్బకు జనసేన పార్టీకి కూడా అదే గతి పడుతుందన్నారు.

Exit mobile version