Ambati Rambabu: నా నియోజకవర్గంలో నా బెండు తీయడమా? అలా జరగదు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో సోమవారం నాడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. అయితే తనపై మహిళలు తిరగబడ్డారంటూ కొన్ని మీడియా ఛానళ్లలో రావడంపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని వెబ్ సైట్లలోనూ తనపై ఓ వార్తను పదేపదే ప్రచారం చేశారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ‘గడప గడపకు.. కార్యక్రమంలో అంబటి రాంబాబుపై మహిళలు తిరగబడ్డారు’ అనేది ఆ వార్త సారాంశం అని వివరించారు. అంబటి రాంబాబును మహిళలు నిలదీశారని, బెండు తీశారని ప్రసారం చేస్తూ శునకానందం పొందారని అంబటి రాంబాబు మండిపడ్డారు.
Read Also: యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు
Also Read
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
‘ఈరోజు నా నియోజకవర్గంలో రాజుపాలెం గ్రామంలో గడప గడపకు.. కార్యక్రమంలో భాగంగా 375 ఇళ్లు తిరిగాను. వారికి కార్డులు, పింఛన్లు పంపిణీ చేశాను. టీడీపీకి చెందిన ఒక వ్యక్తి, జనసేనకు చెందిన మరో వ్యక్తి మాత్రం నన్ను అభాసుపాలుచేయడానికి ప్రయత్నించారు. వాళ్లు చేశారు అనడం కంటే ఎల్లో మీడియా ఛానళ్లు ముందే వెళ్లి వాళ్లకు చెప్పి రెచ్చగొట్టి, కెమెరాలు సిద్ధం చేసి ఇదంతా చేసినట్టుగా అనిపిస్తోంది. అక్కడ పెద్ద గొడవ జరగలేదు, నా బెండు తీయడం జరగలేదు. నా నియోజకవర్గంలో నా బెండు తీసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే చిత్తశుద్ధితో పాలన అందిస్తున్నాం. ఈ సందర్భంగా దుష్ట చతుష్టయానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ల ప్రసార మాధ్యమాల్లో నాకోసం స్థలం కేటాయించి వార్తలు రాస్తున్నారంటే మెచ్చుకోవాల్సిందే. అయితే వాళ్లు ఎప్పటికీ పాజిటివ్ వార్తలు వేయరు, నెగెటివ్ వార్తలే’ అంటూ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
— Ambati Rambabu (@AmbatiRambabu) August 1, 2022
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!