Gadapa Gadapaku Work Shop: గడప గడపకు మన ప్రభుత్వంపై అమరావతి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వర్క్ షాప్ జరుగుతోంది. సీఎం జగన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జులు, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేల పని తీరుపై సీఎం జగన్‌కు నివేదికలు అందాయి. ఎమ్మెల్యేల పనితీరుపై ఐప్యాక్ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజంటేషన్…
అమరావతి సీఎం క్యాంప్ కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ.. మొదటిసారి వర్క్‌షాపుతో పోలిస్తే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పురోగతి బాగుందన్నారు. కానీ అందరికీ ఒక విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నానని.. పరీక్ష రాసేటప్పుడు షార్ట్‌కట్స్ ఉండవని.. షాట్‌కర్ట్స్‌కు మనం తావిస్తే ఆ పరీక్షల్లో ఫెయిల్ అవుతామన్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం అని… ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించుకోవాలని హితవు పలికారు.…
CM Jagan Mohan Reddy: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ం అధ్యక్షతన రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై సీఎం జగన్ స్వయంగా సమీక్షించారు. అయితే గడప గడపకు కార్యక్రమం విషయంలో పలువురు ఎమ్మెల్యేలు వెనుకబడటంతో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు 27 మంది ఎమ్మెల్యేలకు ఆయన క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. 27 మంది పేర్లతో…
Ambati Rambabu: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో సోమవారం నాడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. అయితే తనపై మహిళలు తిరగబడ్డారంటూ కొన్ని మీడియా ఛానళ్లలో రావడంపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని వెబ్ సైట్లలోనూ తనపై ఓ వార్తను పదేపదే ప్రచారం చేశారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ‘గడప గడపకు.. కార్యక్రమంలో అంబటి రాంబాబుపై మహిళలు తిరగబడ్డారు’ అనేది ఆ వార్త సారాంశం…