Manchu Mohan Babu: మరో వివాదంలో మంచు మోహన్‌బాబు.. ఈ సారి షిర్డీ సాయినాథునిపై..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ హీరో, విలక్షణ నటుడు మంచు మోహన్‌బాబు మరో వివాదంలో చిక్కుకున్నారు.. షిర్డీ సాయినాథునిపై ఆయన చేసిన వ్యాఖ్యలే తాజా వివాదానికి కారణంగా మారాయి.. చంద్రగిరి మండలం రంగంపేటలో దక్షిణాదిలోనే అతి పెద్దదైన సాయి బాబా గుడిని నిర్మించారు. ఆ గుడికి సంబంధించి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు మోహన్ బాబు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ గుడి దక్షిణాదిలోనే అతి పెద్దదని ఇదొక అద్భుతం. నా దృష్టిలో ఇక భక్తులు షిర్డీ సాయినాథుని ఆలయానికి వెళ్లనక్కర్లేదు అని వ్యాఖ్యానించారు.. షిర్డీపై మోహన్‌బాబు చేసిన కామెంట్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు భక్తులు..
Read Also: Munugode ByPoll : దుబ్బాక, హుజురాబాద్ ఫలితాలతో గులాబీ పార్టీ గుణపాఠం నేర్చుకుందా?
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
ఇక, ఈ గుడి కట్టాలనుకున్నప్పుడు విష్ణు బాబు ఒక మాట అన్నాడు… వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చిన భక్తులందరూ ఈ గుడికి రావాలి.. అలా కడితే కట్టండి లేకపోతే లేదు అన్నాడని గుర్తుచేసుకున్నారు మోహన్‌బాబు.. అలాగే కట్టానని అనుకుంటున్నాను. మహాద్భుతంగా కట్టాం. రుషికేష్ నుంచి దాదాపు 110 సంవత్సరాలకు పైనున్న యోగి సహా యోగులు, రుషీశ్వరులు నుంచి చెక్కలు, ఆయన లిపితో రాసిన కొన్ని అమూల్యమైన మూలికలు తీసుకొచ్చి ఆలయంలో పెట్టామన్నారు.. ఇదంతా నా ఒక్కడి కోసమే కాదు.. విద్యాలయం, పక్క గ్రామాలు, రెండు తెలుగు రాష్ట్రాలు, యావత్ భారతదేశం నెంబర్ వన్‌గా ఉండాలని, అందరూ క్షేమంగా ఉండాలని ఈరోజు ప్రారంభించామని తెలిపారు.. అయితే, అదంతా ఎలా ఉన్నా.. సాయి భక్తులు ఇకపై షిర్డీకి వెళ్లనవసరం లేదని మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాగా, చంద్రగిరి మండలం రంగంపేటలో దక్షిణాదిలోనే అతి పెద్దదైన సాయి బాబా గుడిని నిర్మించారు మోహన్‌బాబు… మంగళవారం ఆ గుడికి సంబంధించి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. మోహన్ బాబు దంపతులు, విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్న ఇలా మంచు ఫ్యామిలీ మొత్తం ఆ కార్యక్రమంలో పాల్గొంది..
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!