అనుకున్నది ఒక్కటి.. అయిందొకటి. తాము ఒకటి తలిస్తే విధి వేరొకటి తలిచింది. కాకినాడ జిల్లా పిఠాపురం లో ప్రేమజంట రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ప్రియుడు చనిపోగా ప్రియురాలు హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది..కొత్త జీవితం ప్రారంబిద్దామనుకునే లోపే వారి ఆశలు అడియాశలు ఆయ్యాయి.. ఇంట్లో వారిని ఎదిరించి ఒక్కటవుదాం అనుకున్నారు ఆ ప్రేమ జంట, యువకుడు కుటుంబ సభ్యులు మాత్రం యువతి కుటుంబ సభ్యులే చంపేసి ఆక్సిడెంట్ గా క్రియేట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు
కాకినాడకు చెందిన గణేష్ ,దీప్తి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.. గణేష్ డిగ్రీ చదువుతుండగా దీప్తి ఇంటర్ కంప్లీట్ చేసింది గత నెలలోనే దీప్తి తండ్రి అనారోగ్యంతో చనిపోయారు.. అయితే ఇద్దరు తమ ప్రేమని కుటుంబ సభ్యులకు చెప్పారు.. కలిసి జీవిస్తామని వారి నిర్ణయం కోసం ఎదురు చూశారు ఈ వయసులో పెళ్లి ఏంటని ఇరువురు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.. ముందు సెటిల్ అయ్యాక తర్వాత ఆలోచిద్దాం అని చెప్పారు.. అయితే గణేష్ దీప్తి లు మాత్రం మరొక విధంగా ఆలోచించారు కుటుంబ సభ్యులు తమను విడదీస్తారని ఇద్దరు ఒకటి అవ్వాలని నిర్ణయించుకున్నారు.
వారిని ఎదిరించి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు ఇంట్లో వారికి చెప్ప కుండా అన్నవరం వెళ్లి సత్యదేవుని ఆలయ సన్నిధిలో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నారు.. అనుకున్న ప్రకారం గణేష్ , దీప్తి లు శుక్రవారం తెల్లవారుజామున బైకుపై బయలుదేరారు.. పిఠాపురం బీమ్ నగర్ వద్ద మలుపులో అదుపుతప్పి రైలింగ్ ను ఢీకొట్టారు.. తీవ్రగాయలయిన ఇద్దరిని హైవే పెట్రోలింగ్ పోలీసులు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. మార్గమధ్యలోనే గణేష్ మృతి చెందగా, దీప్తి ని మాత్రం మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో గణేష్ మృతి చెంది దీప్తి గాయాలతో బయటపడంపై తమకు అనుమానాలు ఉన్నాయని, వారు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని దీప్తి బంధువులు హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని మృతుడు గణేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
గణేష్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేసారు.. పూరిస్తాయి దర్యాప్తు చేసి తమ కుమారుడు మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని గణేష్ తల్లిదండ్రులు కోరుతున్నారు.ఏది ఏమైనా తమ ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించకపోయిన, వారిని ఎదిరించి దైవ సన్నిధిలో ఒక్కటై కొత్త జీవితాన్ని ప్రారంభించాలని వారు కన్న కలలు అడియాసగానే మిగిలింది.. మృత్యువు వారిద్దరిని విడదీసింది..గణేష్ కుటుంబం లో కన్నీళ్లను మిగిల్చింది.
Heavy Rains: తెలంగాణలో వర్షబీభత్సం.. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్