తెలుగు రాష్ట్రాల్లో ఒక్క క్లిక్ తో రుణాలు అంటూ ప్రజలను మోసం చేసి వేధిస్తున్న రెండుకేసులలో నలుగురు కేటుగాళ్ళను అదుపులోనికి తీసుకున్నారు కృష్ణా జిల్లా పోలీసులు…పెనమలూరులోని ఆత్కుర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన లోన్ యాప్ వేధింపుల కేసులను అత్యంత చాకచక్యంగా ఛేదించగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కేటుగాళ్లు పన్నిన వలలో చిక్కుకొని జీవితాలను బలికానివ్వద్దని తెలిపారు ఎస్పీ. అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకొని బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదు జిల్లా ఎస్పీ. నిందితులను అదుపులోనికి తీసుకోవడంలో అత్యంత ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించారు జిల్లా ఎస్సీ.
కుటుంబ అవసరాల నిమిత్తం, పిల్లల చదువు కోసం, ఇతర పనుల కోసం నగదు అన్వేషన్లో ఉన్న అమాయక ప్రజల అవసరాలను పెట్టుబడిగా మార్చుకొని ఎటువంటి షురిటీ ఇవ్వాల్సిన పనిలేదని నమ్మిస్తున్నారు. డాక్యుమెంటేషన్ మాటే లేదు అంటూ ఒక్క క్లిక్ తో తక్షణ ఋణం అంటూ లోన్ యాప్ ద్వారా రుణాలు మంజూరు చేస్తూన్నారు.సకాలంలో బకాయిలు చెల్లిస్తున్నప్పటికీ వడ్డీల పేరుతో అధిక మొత్తాలను వసూలు చేస్తూ, చెల్లించలేని పక్షంలో వారి ఫోటో లను అసభ్యంగా చిత్రీకరించి బెదిరింపులకు గురి చేస్తూ ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపిస్తున్న లోన్ యాప్ కేటుగాళ్లను అదుపులోనికి తీసుకోవడం జరిగింది.
Read Also: Loan Apps Harassments Death: ఆగని లోన్ యాప్ వేధింపులు.. యువకుడు బలి
తదుపరి విచారణలో మిగిలిన నేరస్తుల పాత్రను నిర్ధారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.లోన్ అప్ వేధింపులపై తక్షణం విచారణ చేసి సైబర్ నేరగాళ్ల ఆట కట్టించమని, డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశించారు. కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా అడిషనల్ ఎస్పీ వెంకట రామాంజనేయులు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పెనమలూరు, అత్బుర పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు గురించి ప్రతిష్టాత్మకంగా స్వీకరించి విచారణ ప్రారంభించారు. ఆధార్, పాన్ కార్డ్ సమాచారం ఇస్తే చాలు లోన్ గ్యారెంటీ అని వచ్చే నోటిఫికేషన్ల ను నమ్మి లోన్ తీసుకున్నారో ఇక అంతే. లోన్ ఆప్ సిబ్బంది ప్రాణం పోయినా వదిలే ప్రసక్తి లేదు. బంధువులు, స్నేహితులకు సైతం ఫోన్ చేసి వేధిస్తారు. అనధికారికంగా చలామణి అవుతున్న నకిలీ లోన్ ఆప్ లను నమ్మి ప్రజలు మోసపోవద్దని కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి తో నడపబడుతున్న బ్యాంకుల వద్ద నుండి సంబంధిత పత్రాలు సమర్పించి లోన్లు పొందాలని ఎస్పీ హితవు పలికారు.
Read Also: Swimming Tragedy: ప్రాణాలు తీస్తున్న ఈత సరదా