కర్నూలు హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది కోర్టు. కోవెలకుంట్ల మండలం భీమునిపాడుకు చెందిన నరసింహా రెడ్డి హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు విధించారు ఆళ్లగడ్డ ఐదవ అడిషనల్ జిల్లా జడ్జి కోర్టు. 2013 మే 10న కలుగోట్ల సమీపంలో ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు నరసింహారెడ్డి. ఈ కేసులో నిందితుడు ఆరికట్ల చిన్న సుంకిరెడ్డి, ఆరికట్ల సురేంద్ర నాథ్ రెడ్డి ,ముక్కమల్ల సురేష్ రెడ్డి , బిచ్చగాళ్ల సుబ్బారాయుడు , పశువుల బాలస్వామి లపై నేరం నిర్ధారణ చేసారు. ఇప్పుడు ఆ నిందితులకు ఐదుగురికి జీవిత ఖైదు విధించారు. అయితే భీమునిపాడులో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు.