NTV Telugu Site icon

Tirumala Landslides: తిరుమలలో భారీ వర్షాలు.. టీటీడీ అలర్ట్

Tirumala

Tirumala

Tirumala Landslides: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. రెండవ ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడే అవకాశం ఉండడంతో ప్రత్యేకంగా మొబైల్ స్క్వాడ్ బృందాలను అధికారులు నియమించారు. ఇంజనీరింగ్, ఫారెస్ట్, విజిలేన్స్ సిబ్బందితో కూడిన టీంలని ఏర్పాటు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ఘాట్ రోడ్డును నిరంతరాయంగా ఈ మొబైల్ స్క్వాడ్ టీంలు తనిఖీ చేయనున్నాయి. అయితే, రెండవ ఘాట్ రోడ్డులో అక్కడక్కడ మట్టిపెళ్లలు విరిగిపడుతున్నాయి. ఇక, జేసీబీల సహాయంతో మట్టి పెళ్లను సిబ్బంది తొలగిస్తున్నారు.

Read Also: Viral : మూత్రం పోసి చపాతీలు పిసికిన పనిమనిషి.. సీసీ కెమెరాలో చూసి కంగుతిన్న యజమాని

అయితే, మరోవైపు తిరుమలలోని రెండో ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి గుడి తర్వాత సెకండ్ మలుపు దగ్గర రోడ్డుపై బండరాళ్లు విరిగి పడ్డాయి. వెంటనే అలర్టైన టీటీడీ అధికారులు యుద్ద ప్రాతిపదికన బండరాళ్ళను తొలగించేస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో ఘాట్ రోడ్లో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో వాహన దారులు అలర్టుగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు.