Free Bus Scheme: మహిళలకు శుభవార్త చెప్పిన సీఎం.. ఉచిత బస్సు ప్రయాణం అమలుపై కీలక ప్రకటన

  • మహిళకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు..
  • ఉచిత బస్సు ప్రయాణం అమలుపై కీలక ప్రకటన..
  • ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం..
Babu

Babu

Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఉచిత బస్సు ప్రయాణంపై ప్రచారం సాగుతూనే ఉంది.. ముహూర్తం పెట్టేశారు.. ఆ డేట్‌ నుంచే అమలు చేస్తున్నారు.. ఇలా ఎన్నో ప్రచారాలు సాగుతూ వచ్చాయి.. అయితే, మహిళకు శుభవార్త చెబుతూ.. ఉచిత బస్సు ప్రయాణం అమలుపై కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కర్నూలు జిల్లా పర్యటనలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మహిళలందరికీ ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు.. ఇక, తల్లికి వందనం అమలు చేస్తాం.. ఓ కుటుంబంలో ఎంత అంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు.

Read Also: Vijay Devarakonda : రష్మికతో పెళ్లిపై స్పందించిన విజయ్.. ఏమన్నాడంటే..?

రాయలసీమను రతనాల సీమగా చేస్తాం.. రైతులకు 14 వేలు చొప్పున రైతుభరోసా ఇస్తాం అన్నారు సీఎం చంద్రబాబు.. దేశంలో ఎక్కువ పింఛను ఇచ్చే రాష్ట్రం మనదేనన్న ఆయన. అన్ని నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. దీపం-2 కింద ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నాం. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నాం.. పాఠశాలలు తెరిచేలోగా ఉపాధ్యాయుల భర్తీ పూర్తి చేయబోతున్నామని తెలిపారు.. ఆగష్టు 15 నుంచి మహిళకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అమలు చేస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు..

Read Also: Vijay Devarakonda : రష్మికతో పెళ్లిపై స్పందించిన విజయ్.. ఏమన్నాడంటే..?

మిద్దెతోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తాం.. పొదుపు సంఘాల మహిళలను మిద్దెతోటల పెంపకంలో భాగస్వాములను చేస్తాం అన్నారు సీఎం చంద్రబాబు.. ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్తను పొడి చెత్త, తడి చెత్తగా వేరు చేసి తడిచెత్తను కంపోస్టుగా తయారు చేయాలి.. ఇంట్లో తయారయ్యే కంపోస్టు మిద్దెతోటలకు వినియోగించవచ్చు అని సూచించారు.. రైతు బజార్లు నేనే పెట్టా .. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు బజార్లు పెట్టాం.. మధ్య దళారులు లేకుండా రైతులు వారి పంటలు అమ్ముకునే అవకాశం కల్పించాం.. 125 రైతు బజార్లు ఉన్నాయన్నారు.. కర్నూలులో 6 కోట్లతో బెస్ట్ రైతు బజారుగా మారుస్తాం., 175 నియోజకవర్గాల్లో రైతు బజార్లు పెడతాం.. రైతులకు గిట్టుబాటు ధర రావాలి, వినియోగదారులకు సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులు దొరకాలి.. రాష్ట్రంలో అన్ని రైతు బజార్లను మెరుగుపరుస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు..