Devaragattu Bunny Utsavam 2026: దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు అంతా రెడీ.. భారీ భద్రత ఏర్పాటు.. ఉత్సవం వెనుక అసలు కథ ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devaragattu Bunny Utsavam 2026: దేవరగట్టు శ్రీ మాళ మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కర్నూలు జిల్లా హళగుంద మండలం దేవరగట్టులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 1000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాల నిర్వహణను పోలీసులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. భద్రతలో భాగంగా దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో 110 నైట్ విజన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచనున్నారు. అలాగే, రాత్రి వేళల్లోనూ స్పష్టమైన దృశ్యాలు కనిపించేలా ఉత్సవ ప్రాంతంలో 700 ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 10 డ్రోన్ కెమెరాలను కూడా వినియోగించనున్నారు.
భక్తుల రాకపోకలు, భద్రతా పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఐదు చెక్‌పోస్టులు, 10 పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు. వీడియో కెమెరాలతో పాటు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా ఉత్సవాల నిర్వహణపై నిరంతరం నిఘా కొనసాగించనున్నారు. మరోవైపు, ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు ఇప్పటికే 190 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అన్ని విభాగాలను అప్రమత్తం చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టారు.
Also Read
- Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
అయితే, మాల మల్లేశ్వర కళ్యాణోత్సవం అనంతరం జరిగే కర్రల సమరం ఎంతో చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. త్రేతాయుగంలో మని, మల్లాసూరులు అనే రాక్షసులను కాల భైరవుడి అవతారంలో శివుడు అంతమొందిస్తాడు. రాక్షసులు ప్రాణాలు విడిచే సమయంలో తమకు ప్రతి ఏటా భక్తుల రక్తాన్ని ఓ కుండ నిండా సమర్పించాలని కోరుకున్నారట. అందుకు శివపార్వతులు అంగీకరించారని స్థలపురాణం చెబుతోంది. పిడికెడు రక్తం ఇచ్చేందుకు ఏటా రక్ష పడి వద్దకు వచ్చే భక్తులను గోరవయ్యాలు అడ్డుకునేయత్నం చేస్తారని ప్రతీతి. ఆ సమయంలో మాళమ్మ విగ్రహాన్ని తీసుకుని పూజారి దబనంతో తొడ నుంచి పిడికెడు రక్తం సమర్పిస్తారు. వెంటనే డిర్రు గో పరక్ అంటూ కేకలు వేస్తూ జరిగే బన్నీ జైత్రయాత్రలో కర్రలతో కొట్టుకుంటారు. దీంతో తలలు పగిలి రక్తం చిమ్ముతుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
8 వందల అడుగుల ఎత్తులో కొలువుదీరిన పార్వతీ పరమేశ్వరులను దర్శించుకునేందుకు అర్థరాత్రి నెరణికి, కొత్తపేట, ఎల్లార్తి గ్రామాల ప్రజలు పాల బాస చేస్తారు. ఘర్షణలు లేకుండా కలసికట్టుగా ఉత్సవాలను విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున కర్రలు, అగ్ని కాగడాలు చేత బూని శివ, పార్వతుల కల్యాణం జరిపిస్తారు. కల్యాణోత్సవం ముగిశాక ఉత్సవ మూర్తులను పల్లకిలో సింహాసనం కట్ట వద్దకు చేరుస్తారు. అప్పుడే కర్రల సమరం హోరాహోరీగా జరుగుతుంది. ఉత్సవ మూర్తులు తమ గ్రామనికే దక్కాలంటూ మూడు గ్రామాల భక్తులు కర్రలతో శబ్దం చేస్తూ పోటీ పడడంతో తలలు పగుల్తాయి. వెంటనే బండారు పూసుకుని అలాగే బన్నీ ఉత్సవంలో పాల్గొంటారు. గ్రామస్తులు దీనిని ఓ క్రీడగా భావిస్తున్నా కర్రల సమరం మాత్రం భీకరంగా జరుగుతుంది.
బన్నీ ఉత్సవానికి ముందు వచ్చిన అమావాస్య నుంచి భక్తులు దీక్ష చేపట్టి ఉత్సవాలు ముగిసేంతవరకు చాలా నిష్టతో ఉంటారు. కొండపై నుంచి విగ్రహాలు తిరిగి గ్రామానికి చేరేంతవరకు మద్యం, మాంసం ముట్టరు. దాంపత్య జీవితానికి దూరంగా ఉంటారు. 7 గ్రామాల ప్రజలు ఈ కట్టబాట్లు పాటిస్తారు. అయితే ఇతర గ్రామాల నుంచి కొంతమంది మద్యం సేవించి కర్రల సమరంలో పాల్గొంటుడడంతో హింసాత్మక ఘటనలు ఏటా చోటుచేసుకుంటున్నాయి. వందల మంది తలలు పగులుతున్నాయి. అయినా సరే కర్రల సమరం వీడట్లేదు స్థానికులు. ప్రతీ ఏటా బన్నీ ఉత్సవంలో పదుల సంఖ్యలో గాయపడుతున్నారు. కొందరైతే ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అయినా ఆచారం పేరుతో సాగే నెత్తుటి కాండకు ఎవరూ అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఈసారి కూడా భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తున్నారు..
తాజావార్తలు
-
Devaragattu Bunny Utsavam 2026: దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు అంతా రెడీ.. భారీ భద్రత ఏర్పాటు.. ఉత్సవం వెనుక అసలు కథ ఏంటి?
-
Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టు ఆదేశాలు వైసీపీకి బూస్ట్.. 19 మున్సిపాలిటీల్లో గెలుపు మాదే..!
-
ICC U19 Women’s T20 World Cup 2027: మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2027 షెడ్యూల్ విడుదల.. భారత్ తొలి మ్యాచ్ ఎవరితోంటే!
-
Delhi High Court: ‘మీరు జెన్-జీ కాదు’.. సీజేపీ నేతల వయసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Jio Platforms IPO GMP today: జియో ప్లాట్‌ఫామ్స్ IPOకు భారీ స్పందన.. రూ.276 ప్రీమియం.. లిస్టింగ్ ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!