Purchase iPhone 13 Just Rs 21399 in Flipkart Big Saving Days 2023: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2023 నడుస్తోంది. ఈ సెల్‌లో స్మార్ట్‌ఫోన్, టీవీ, ఏసీ, ఫ్రిజ్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లపై. మీరు ఐఫోన్ ప్రియులు అయుండి, అందులోనూ ఐఫోన్ 13 కొనుగోలు చేయాలనుకుంటే.. ఇదే మంచి సమయం. బడ్జెట్ తక్కువగా ఉన్నా ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 70 వేల రూపాయల ఐఫోన్ 13ను రూ. 21 వేలకే మీరు ఇంటికితీసుకెళ్లిపోవచ్చు.
iPhone 13 Flipkart Offers:
ఐఫోన్ 13 (128 GB) వేరియంట్ అసలు ధర రూ. 69,900. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2023లో 17 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. దాంతో ఐఫోన్ 13 మీకు రూ. 57,999కు లభిస్తుంది. ఈ మొత్తం మీకు భారంగా ఉంటే.. ఐఫోన్ 13పై అనేక బ్యాంక్ మరియు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు ఉన్నాయి. అవి ఈ ఫోన్ ధరను మరింత తగ్గిస్తాయి.
Also Read: Ram Charan Dog: చెల్లెలిపై ఓ కన్నేసి ఉంచా.. రామ్ చరణ్ కుక్క ఫొటో వైరల్!
iPhone 13 Bank Offer:
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై ఆఫర్ ఉంది. మీరు ఐఫోన్ 13ని కొనుగోలు చేయడానికి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. వెయ్యి రూపాయల తగ్గింపు లభిస్తుంది. దాంతో ఈ ఫోన్ ధర రూ.56,999గా ఉంటుంది.
iPhone 13 Exchange Offer:
ఐఫోన్ 13పై రూ. 35,600 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు మీ పాత ఫోన్‌ని ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే మీకు ఇంత మొత్తం లభిస్తుంది. అయితే మీ పాత ఫోన్ లేటెస్ట్ మోడల్ అయుండి, మంచి కండీషన్‌లో ఉంటేనే రూ. 35,600 పూర్తి తగ్గింపు లభిస్తుంది. ఒకవేళ మీరు పూర్తి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పొందగలిగితే.. ఐఫోన్ 13 మీకు రూ. 21,399లకే సొంతం అవుతుంది.
Also Read: Dwayne Bravo Six: డ్వేన్ బ్రావో భారీ సిక్సర్.. వీడియో చూస్తే వావ్ అనకుండా ఉండలేరు!