YS Jagan: మొంథా తుఫాన్ ఏపీలో విధ్వంసమే సృష్టించింది.. కృష్ణా జిల్లాలో తుఫాన్ బాధిత రైతులను కలిసిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. పంట నష్టంపై ఆరా తీశారు.. ప్రభుత్వం నుంచి ఏ మేరకు సాయం అందిందని అడిగి తెలుసుకున్న ఆయన.. కూటమి సర్కార్‌పై ధ్వజమెత్తారు.. రాష్ట్రంలో రైతు పరిస్థితి తెలుసుకోవాలంటే గ్రౌండ్ లోకి తిరిగి చూస్తే అర్థం అవుతుంది.. ఈ ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా, నిర్దయగా వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు.. గోదావరి జిల్లాల నుంచి కర్నూల్ వరకు తుఫాను ఎఫెక్ట్ ఉంది.. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. గతంలో ఎప్పుడూ ఊహించని విధంగా పంట పొలాలు మొత్తం నేట మునిగాయి.. తీవ్ర గాలులకు పంటలు దెబ్బతిన్నాయి.. రైతుల ఆరుగాలం కష్టం కోల్పోయారు.. పత్తి, మొక్కజొన్న, బత్తాయి పంటలు నాలుగు లక్షల ఎకరాల్లో మునిగాయి.. 18 నెలల చంద్రబాబు ప్రభుత్వంలో 16 సార్లు ప్రకృతి విపత్తులు సంభవించాయి.. 18 నెలలుగా ఒక్క రైతుకైనా ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇచ్చారా..? ఇన్సూరెన్స్ డబ్బులు, పెట్టుబడి సాయం అందిందా..? అనినిలదీశారు వైఎస్ జగన్.
Read Also: Kalvakuntla Kavitha : అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు
పూర్తిగా ఈ ప్రభుత్వం రైతుల వెన్ను విరిచిందని విమర్శించారు జగన్.. చివరికి ఉచిత పంటల బీమా కూడా లేకుండా పోయింది.. ఒక్కొక్క రైతు వేల రూపాయల నుంచి లక్షల్లో నష్టపోయారు.. ఎరువులు కూడా బ్లాకులో కొనుక్కోవాల్సి వచ్చింది. ఇంత దారుణ పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవన్నారు.. ఇన్ని కష్టాలతో పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు.. ప్రతీ అడుగులో కూడా రైతు నష్టపోతున్నారనన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అండగా నిలబడ్డాం.. ఒక్క రైతు కూడా భయపడలేదు.. అందరికీ భరోసా ఉంది.. అన్న ఉన్నాడన్న ధైర్యంతో ఉండేవారు.. డబ్బులు వస్తే తర్వాత సీజన్ పెట్టుబడి పెట్టడానికి డబ్బులు అందేవి.. ఏ రైతు కూడా ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేరన్నారు.. ఆర్బీకేల పరిధిలో సచివాలయంతో అనుసంధానమై ఈ క్రాప్ బుకింగ్ నమోదయ్యేది.. రైతుకు ఎప్పుడు ఏ పంటకు ఇబ్బంది జరిగినా నష్టపరిహారం అందేది.. ప్రభుత్వం రైతులకోసం ఉంటుంది అనే భరోసా లభించేది.. ఎక్కడ పంట రేట్లు తగ్గినా ప్రభుత్వం స్పందించేది.. మార్క్ ఫెడ్ ద్వారా మార్కెట్ లో కాంపిటీషన్ క్రియేట్ చేసి పంటలకు గిట్టుబాటు ధరలు ఇచ్చే వాళ్లం.. సీఎం యాప్ సాయంతో గతంలో అన్నీ అందుబాటులో ఉండేవి.. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని గుర్తుచేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి..