విజయవాడ - బెంగళూరు విమానానికి పెను ప్రమాదం తప్పింది.. గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లేందుకు విమానం టేక్ ఆఫ్ అవుతోన్న సమయంలో పక్షిని ఢీకొట్టింది విమానం.. దీంతో, విమానం రెక్కలు దెబ్బతిన్నాయి.. ఊహించని ఘటనతో షాక్ తిన్న పైలట్.. వెంటనే విమానాన్ని తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లోనే ల్యాండ్ చేశారు.. దీంతో, ప్రయాణికులు, సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు..