Minister Kollu Ravindra: వైఎస్ జగన్, వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర.. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ ఐ ప్యాక్ డ్రామాలు ప్రజలు నమ్మరని తెలిపారు.. అధికారంలో ఉండగా చేసిన తప్పులను ప్రశ్నిస్తామనే భయంతో… జగన్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు.. పోలీసులను బెదిరించే నీచ రాజకీయాలకు జగన్ తెర లేపారని ఫైర్ అయ్యారు.. దళిత సోదరుని కిడ్నాప్ చేస్తే కేసులు పెట్టరా? అని నిలదీశారు.. ప్రజలు గుడ్డలూడదీసి రోడ్డుమీద నిల్చోబెట్టినా.. జగన్ ప్రవర్తనలో మార్పు రావడం లేదన్నారు.. అసలు జగన్ ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కావడం లేదు. మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు మాట్లాడారని వెల్లడించారు.
Read Also: Aadi Pinisetty: ‘వైరం ధనుష్’ను మరిపించే అఖండ!
అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు చెప్పినా.. రాజకీయ స్వార్థానికే వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డ్ కి వెళ్లారని దుయ్యబట్టారు మంత్రి కొల్లు రవీంద్ర.. పెయిడ్ ఆర్టిస్టులను రైతులుగా నిలబెట్టి… ఐ ప్యాక్ చేస్తున్న డ్రామాలను ప్రజలు ఛీ కొడుతున్నారని పేర్కొన్నారు.. ఇక, మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన రవీంద్ర.. బూతులు మాట్లాడడానికైతే ఉద్యోగం అవసరం… ప్రజాసేవ చేయడానికి ఉద్యోగం కావాలా? అని ఎద్దేవా చేశారు.. ప్రతిపక్షంలో ఉన్న.. అధికారంలో ఉన్న… ప్రజలకు జవాబుదారీగానే తాము పని చేశాం. అవినీతి, అరాచకాలు, విధ్వంసంతో నాశనమైన కృష్ణాజిల్లా… ఖ్యాతిని తిరిగి తీసుకొచ్చేందుకు మేమంతా కష్టపడుతున్నాం అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర..