Kollu Ravindra: నిన్న పేర్ని నాని గుడివాడ వెళ్తే కొడతారనే హౌస్ అరెస్ట్ డ్రామా చేశాడు అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గుడివాడ వెళ్లే దమ్ము ధైర్యం లేక ఇంట్లో కూర్చుని హౌస్ అరెస్ట్ చేశారని చెప్పుకుంటున్నాడు.. సాక్షాత్తు జిల్లా ఎస్పీనే మేము హౌస్ అరెస్టు చేయలేదని చెప్పారు.. నిన్న గుడివాడలో జెడ్పీ చైర్మన్ హారిక, రాము దంపతులు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు.. గతంలో జరిగిన జడ్పీ సమావేశాల్లో కూడా చైర్మన్ ఇదే విధంగా వ్యవహరించింది అని పేర్కొన్నారు. తప్పు చేసిందే కాకుండా బీసీ కార్డు తెరపై తెస్తున్నారు అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
Read Also: Kota Srinivas Death : నటనతో ఇండస్ట్రీ ఉలిక్కిపడేలా చేశాడు.. ఆర్.నారాయణ మూర్తి కామెంట్స్
ఇక, సభలు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు.. ఆ పేరుతో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం ఉపేక్షించే లేదని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వైసీపీ జాడ కూడా కనపడదు.. మచిలీపట్నంలో వంగవీటి మోహన రంగా ఫ్లెక్సీ చించి, అశాంతిని సృష్టించాలని చూస్తున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ గంగధర్ ని ఆదేశించామని మంత్రి రవీంద్ర వెల్లడించారు.