Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నాని మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండటంతో.. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు, శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చారు. పేర్ని నాని వ్యాఖ్యలను నిరసిస్తూ నిన్న ఆయన నివాసానికి సమీపంలో తెలుగు దేశం పార్టీ మహిళ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ నిరసనలో చీపుళ్లతో పేర్ని కిట్టును కొట్టారు.
Read Also: Heart Attack: గుండెనొప్పి ఎప్పుడైనా రావొచ్చు.. ఈ ఒక్క ట్యాబ్లెట్ మీ ఇంట్లో ఉంచుకోండి..!
ఇక, నిన్న టీడీపీ ఆందోళనకు నిరసనగా నేడు వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంత్రి కొల్లు రవీంద్ర నివాసరం దగ్గర నిరసన చేపట్టారు. మంత్రి ఇంటి దగ్గర కొల్లు చిత్రపటాన్ని వైసీపీ మహిళ విభాగం నేతలు చీపుళ్లతో కొట్టారు. దీనికి కౌంటర్ గా వైసీపీ నిరసనపై టీడీపీ మహిళా నేతలు రామానాయుడు పేట సెంటర్లో పేర్ని నాని దిష్టిబొమ్మ తగలబెట్టారు. దీంతో మచిలీపట్నంలో రాజకీయం వేడెక్కింది. పేర్ని నాని ఇంటి దగ్గర పోలీసులను భారీగా ఏర్పాటు చేశారు.
