Perni Nani: కృష్ణజిల్లా మచిలీపట్నంలో పర్యటించిన వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. మాజీ సీఎం జగన్ కారులో ప్రయాణిస్తే నాపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. అనుమతి ఉన్న కారులో వెనక సీట్లో కూర్చుని ప్రయాణిస్తేనే కూడా కేసు పెడతారని ప్రశ్నించారు. మరి గతంలో నీవు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజమండ్రి పుష్కరాల్లో స్నానాలు చేస్తూ షూటింగ్ తీస్తున్న క్రమంలో 30 మంది భక్తులు చనిపోయారు.. చనిపోయిన భక్తుల బంధువులు కేసులు పెడితే రానున్న మా ప్రభుత్వంలో మీతో పాటు వెనక మీ కుటుంబ సభ్యులు, నీ కుమారుడు లోకేష్, సినిమా డైరెక్టర్ పై ఎందుకు కేసులు పెట్టకూడదని చంద్రబాబును పేర్నినాని ప్రశ్నించారు.
Read Also: Ghosts in Dreams: కలలో దెయ్యాలు కనిపిస్తున్నాయా? అది దేనికి సంకేతం..?
అలాగే, గుంటూరులో రూ 50 రూపాయల చీరలు లారీల్లో తీసుకొచ్చి చంద్రన్న కానుక పేరుతో మహిళలపై విసిరితే ఆ రద్దీలో చనిపోయిన వారి బంధువులు ఫిర్యాదు చేస్తే కేసులు ఎందుకు పెట్టకూడదని పేర్నినాని ప్రశ్నించారు. కందుకూరులో ఇరుకు సందులో నీవు మీటింగ్ పెట్టినప్పుడు మృతి చెందిన వారి బంధువులు కేసు ఎందుకు పెట్టకూడదు అన్నారు.. 2029లో వచ్చే తమ ప్రభుత్వంలో ప్రస్తుతం మీరు వ్యవహరిస్తున్న కక్షపూరిత కేసులకు ప్రతీకార చర్యలకు ధీటుగా సమాధానం చెప్తామని వెల్లడించారు. ఇక, కొల్లు రవీంద్ర ఉంటావా సొల్లు రవీంద్రగా అని కౌంటర్ ఇచ్చారు. ఇటీవల మచిలీపట్నం విచ్చేసిన మంత్రి నారా లోకేష్, కొల్లు రవీంద్ర చీమకు కూడా హాని చేయడని పేర్కొన్నాడు.. ఇది నిజమే.. కొల్లు రవీంద్ర చీమకు, దోమకు కూడా హానిచేయడు.. కానీ, మనుషులను ఇబ్బందులకు గురి చేస్తాడని మాజీ మంత్రి పేర్నినాని చెప్పుకొచ్చారు.
