Kodali Nani: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య వ్యాఖ్యలు చేయడంతో ఐటీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. ఇక, సీఎం చంద్రబాబును కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ.. 2024లో విశాఖ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విశాఖపట్నంకు చెందిన అంజనా ప్రియ.
Read Also: Seethakka: ఓట్ల కోసమే బీజేపీ మత రాజకీయాలు చేస్తోంది.. అధికారం కోసమే కవిత దీక్ష డ్రామా
ఇక, మాజీ మంత్రి కొడాలి నానిపై U/S353(2), 352, 351(4), 196(1) BNS 467, IT Act చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో గుడివాడలోని స్వగృహంలో కొడాలి నానికి 41 సీఆర్పీసీ నోటీసులను విశాఖ త్రీటౌన్ పోలీసులు అందజేశారు. త్వరలో విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు.
