నేడు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. హైకోర్టు ఆదేశాలతో మూడోసారి.. ఈరోజు ఉదయం 10:30కు కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. మొదటిగా సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ ఎన్నిక జరుగుగుతుంది. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా సమావేశానికి హాజరు కావాలంటూ ఎన్నికల అధికారి నుంచి కేశినేని నానికి సమాచారం అదింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు వచ్చాయి. గత రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు పోలీసులు. తమ తరఫున గెలిచిన అభ్యర్థులను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రలోభాలకు గురిచేస్తున్నారంటున్నారు టీడీపీ లీడర్లు.
అయితే కేశినేని నానికి ఓటేసే అర్హతే లేదంటుంది వైసీపీ. పోటాపోటీగా వైసీపీ, టీడీపీ క్యాంప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. గొల్లపూడి దేవినేని ఉమా నివాసంలో టీడీపీ క్యాంప్ ఏర్పాటు చేసారు. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ స్వగ్రామం ఐతవరంలో వైసీపీ క్యాంప్ ఏర్పాటు చేసారు. కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉండగా… 14 వార్డులు వైసీపీ, 14 వార్డులు టీడీపీ గెలిస్తే ఒక వార్డులో ఇండిపెండెంట్ గెలిచారు. అయితే ఆ గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి లక్ష్మి టీడీపీకి మద్దతు పలికింది. అయితే ఆఖరి నిమిషంలో అధికారపక్షం ఎటువంటి ఎత్తులు వేస్తుందోనన్న టెన్షనులో టీడీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తుంది.
Also Read
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!