Amit Shah and Junior NTR Meet: జూనియర్ ఎన్టీఆర్‌తో అధికార మార్పిడి.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ డిన్నర్ భేటీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రచ్చ రేపుతోంది.. ఈ భేటీలో సినిమాకు సంబంధించిన చర్చ, సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావన వచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్నా.. ఇది పక్కా రాజకీయ చర్చ జరిగిన సమావేశంగా ప్రచారం సాగుతోంది.. ఈ తరుణంలో షా-ఎన్టీఆర్ భేటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని.. ఈ పరిణామాలపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. రాజకీయ వ్యూహంతోనే అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ అన్నారు. రాజకీయ ప్రయోజనాలు లేకుండా అమిత్ షా, నరేంద్ర మోడీ ఎవరితోనూ సమావేశం కారని వ్యాఖ్యానించారు.
Read Also: Undavalli Arun Kumar: రెండు తెలుగు రాష్ట్రాల్లో తారక్‌ని బీజేపీ వాడుకుంటుంది
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
దేశ వ్యాప్తంగా బీజేపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసే అవకాశం ఉందని జోస్యం చెప్పారు కొడాలి నాని.. ప్రచారం చేయటానికి ఎన్టీఆర్.. బీజేపీలో చేయాల్సిన అవసరం ఉండదన్న ఆయన.. టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్‌తో అధికార మార్పిడి చేసే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో జరిగిన పరిణామాలు టీడీపీలో వచ్చే అవకాశం ఉందన్న ఆయన.. చంద్రబాబు ఏక్ నాథ్ షిండే.. ఎన్టీఆర్ నుంచి పార్టీని ఏక్ నాథ్ షిండే లానే లాక్కున్నాడని విమర్శించారు. ఇక, చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడి హోదా, పార్టీ అధ్యక్షుడు పదవి ఒకేసారి ఊడతాయని జోస్యం చెప్పారు. 73 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఏ గతి పట్టించాడో అదే పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు పట్టనుందన్నారు.
అయితే, ఎన్టీఆర్ టీడీపీ, బీజేపీ తరపున ప్రచారం చేసినా వైసీపీకి ఎలాంటి ప్రమాదం లేదన్నారు.. కానీ, ఎన్టీఆర్ వస్తే.. ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో కొడాలి నాని చేసిన సంచలన వ్యాఖ్యలను చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!