కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ డిన్నర్ భేటీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రచ్చ రేపుతోంది.. ఈ భేటీలో సినిమాకు సంబంధించిన చర్చ, సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావన వచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్నా.. ఇది పక్కా రాజకీయ చర్చ జరిగిన సమావేశంగా ప్రచారం సాగుతోంది.
అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షా ఉపయోగం లేకుంటే నిమిషం కూడా ఎవరితో మాట్లాడరని పేర్కొన్న ఆయన.. భారతీయ జనతా పార్టీని విస్తరించేందుకే జూనియర్ ఎన్టీఆర్ తో, అమిత్ షా సమావేశం అయ్యాడని భావిస్తున్నానన్నారు..
అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి.. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని సమావేశం అదన్న ఆయన.. సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందన్నారు.