వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మచిలీపట్నంలో వైసీపీ ప్లీనరీ సమావేశాలకు మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి టీడీపీ నేతలకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. మ్యానిఫెస్టోలో చెప్పినవే కాకుండా.. చెప్పని పథకాలను కూడా సీఎం జగన్ అమలు చేస్తున్నారన్నారు. అంతేకాకుండా చంద్రాబాబు మహానాడును నవ్వులు పాలు చేస్తున్నారని విమర్శించారు.
మహానాడు అంటే దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పుట్టిన రోజును ఎంతో పెద్ద ఈవెంట్‌గా జరుపుకునేవారని.. కానీ ఇప్పుడు చంద్రాబు మినీ మహానాడు అంటూ అవహేళన చేస్తున్నారన్నారు. చంద్రాబాబు మతిస్థిమితం కోల్పోయారని, ఆయన కుమారుడు నారాలోకేష్ కు సిద్దప్ప అంటూ కొడాలి నాని కొత్త పేరు పెట్టారు కొడాలి నాని. గతంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ ఉన్న చంద్రబాబు ఇందిరా గాంధీ చెబితే ఎన్టీఆర్‌పై కూడా పోటీ చేస్తానని.. కనీసం చంద్రబాబు నియోజకవర్గంలో ఎన్టీఆర్ నిలబెట్టిన అభ్యర్థిపై కూడా గెలువలేకపోయారన్నారు. ఇప్పుడు కూడా అది చేస్తా.. ఇది చేస్తా నంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు..