NTV Telugu Site icon

Kodali Nani: వంగవీటి రాధా పోటీ చేయడు.. కొడాలి నాని కీలక వ్యాఖ్యలు

Kodali Nani On Radha

Kodali Nani On Radha

Kodali Nani Interesting Comments On Vangaveeti Radha: మాజీమంత్రి కొడాలి నాని తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రాధా ఎట్టి పరిస్థితుల్లోనూ గుడివాడ నుంచి పోటీ చేయడని, రాధా తన సొంత తమ్ముడి లాంటివాడని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్ళు పూర్తి కావడంతో.. కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, అనుబంధ విభాగాల నేతలు హాజరయ్యారు. స్వర్గీయ వైయస్సార్ విగ్రహానికి కొడాలి నాని నివాళులర్పించి అనంతరం పార్టీ నేతలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో వచ్చిన తన గెలుపుల్లో కాపులదే సగభాగమని అన్నారు.

Seediri Appalaraju: బాబు విజనరీ కాదు, విస్తరాకుల కట్ట.. జగన్ మళ్లీ సీఎం కాబోతున్నారు

చచ్చినా రాజకీయాల కోసం కాపులను విమర్శించనని కొడాలి నాని స్పష్టం చేశారు. తాను మాట్లాడిన వ్యాఖ్యల్లో టీడీపీ వాళ్లు కట్ పేస్ట్ చేసి.. వీడియోలు వదిలారని క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియోలు చూసి జనసైనికులు స్పందిస్తున్నారని చెప్పారు. తన జీవితంలో ఇప్పటివరకు రంగాకు వ్యతిరేకంగా జరిగిన ఏ కార్యక్రమంలోనూ తాను పాల్గొనలేదని పేర్కొన్నారు. మహానాడు వేదికపై ఎన్టీఆర్ పక్కన పప్పు, తుప్పు ఫోటోల ఏర్పాటు చేయడంపై మాత్రమే తాను స్పందించానని అన్నారు. వారసుడు బాలయ్య ఫోటో లేకపోయినా.. అచ్చెం లాంటి స్క్రాప్‌ల ఫోటోలను ఎందుకు పెట్టారని తాను ప్రశ్నించానని స్పష్టతనిచ్చారు. టీడీపీ వాళ్లు చూపించిన అబద్ధాన్ని కాపు సోదరులు నమ్మలేదని తెలిపారు. రేపు జనం కూడా టీడీపీని కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ చేసిన నీచాది నీచుల మాయలో పడొద్దని సూచించారు.

Venkatesh: నంది అవార్డులపై వెంకటేశ్ కామెంట్స్.. ఇస్తే ఇవ్వొచ్చు, లేదంటే లేదు

రాజకీయాల్లో ఎప్పుడు వచ్చామనేది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అన్న విధంగా జగన్ పాలన చేస్తున్నారని కొడాలి నాని పేర్కొన్నారు. శక్తివంతమైన సోనియానే ఎదిరించి నిలబడిన జగన్‌ను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయన్నారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావడానికి.. చంద్రబాబు ప్రతిపక్ష హోదా కాపాడుకోవడానికే కలిసి పోటీ చేస్తున్నారన్నారు. అందరి కోసం పనిచేస్తూ.. జగన్ ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. వైఎస్ఆర్ భూమిని వదిలి స్వర్గానికి వెళ్లిపోతే రాష్ట్రం నష్టపోయిందన్నారు. వైఎస్ఆర్ బతికి ఉంటే.. తాను రెండు ముక్కలైన సరే, రాష్ట్రాన్ని విడిపోనిచ్చేవారు కాదన్నారు. ఇప్పుడు జగన్‌కు కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలందరికీ ఉందన్నారు.