NTV Telugu Site icon

Kodali Nani: జగన్‌ పిల్లి కాదు.. పులి.. తెలియకపోతే ఆహారం అయిపోతావ్..!

Kodali Nani On Pk

Kodali Nani On Pk

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పిల్లా కాదు.. పులి… పిల్లికి, పులికి తేడా తెలియకపోతే ఆహారం అయిపోతావు అంటూ నారా లోకేష్‌ని హెచ్చరించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని.. గుడివాడలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. లోకేష్ ముఖ్యమంత్రిని ప్యాలెస్ పిల్లి నా కొడుకు అని నోరు పారేసుకున్నాడని.. జయంతికి, వర్ధంతికి కూడా తేడా తెలియదు ఈ పిచ్చి నా కొడుక్కి అంటూ ఫైర్‌ అయ్యారు. ఇక, పిల్లికి, పులికి తేడా తెలియకపోతే ఆహారం అయిపోతావు… మంగళగిరిలో అదే జరిగింది.. పనికి రాని దద్దమ్మవి.. లోకేష్ టూ టెన్ గాడు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. నువ్వు పనికి రాని దద్దమ్మవనే 420 గాడు హోటల్ ‌కు వెళ్లి వేరేపార్టీ వాళ్ల బూట్లు నాకుతున్నాడు… అంటూ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై మండిపడ్డారు కొడాలి.. ఇక, అద్దం ముందు నిలబడి తన చేతులు ఊపుకుంటాడు అని సెటైర్లు వేసిన ఆయన.. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, కార్యక్రమాల మీద చర్చ జరగకుండా వీళ్లు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Shivraj Patil: కృష్ణుడు, అర్జునుడికి “జీహాద్” గురించి చెప్పాడు..

మేం మాట్లాడితే బూతులు తిడుతున్నామని బయటకు వస్తారు.. అసలు బూతుల స్కూల్ పెట్టిన బూతు నా కొడుడు చంద్రబాబు… ఆ స్కూల్‌కు ప్రిన్సిపాల్ అయ్యన్నపాత్రుడు అంటూ ఫైర్‌ అయ్యారు కొడాలి నాని.. ఇక, ముఖ్యమంత్రి ఫోన్ మాట్లాడుతున్న ఫోటో ఎవరైనా చూపగలరా? లేదా? ఏ ఆఫీసర్ ను అయినా అడగండి అని సూచించారు.. ముఖ్యమంత్రి తన జేబులో బుక్ ఉంటుంది… ఎవరేం చెప్పినా దాని మీద రాసుకుంటారని తెలిపారు.. మరోవైపు, వైఎస్‌ జగన్ ఒకే ఆట ఆడతారు… పొలిటికల్ ఫుట్ బాల్ ఆడతారు అని అభివర్ణించారు కొడాలి నాని.. పది బాల్స్‌ను ఒకేసారి ఆడతారు.. జగన్ ఫుట్ బాల్ ఆట దెబ్బకు చెట్టుకు ఒకరు పుట్టకొకరు అయ్యారు… అయినా ఇంకా వీళ్లకు సిగ్గు రాలేదని మండిపడ్డారు.. సీఎం జగన్‌ ఓ సోషల్‌ ఇంజినీర్.. అని పేర్కొన్న మాజీ మంత్రి.. నిన్న అవనిగడ్డలో జరిగిన మంచి పనిపై చర్చ జరగకుండా లోకేష్ సాయంత్రానికి పిల్లినా కొడుకు అంటూ వాగాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. చంద్రబాబు ఎంత మంది నో సర్వ నాశనం చేశారు అని మండిపడ్డారు. అవనిగడ్డలో రైతులు రైతులు కాదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని.