పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చిత్తూరు నుంచి చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ ముఖ్యమంత్రులు అయ్యారు. పెద్దిరెడ్డి కూడా సీఎం కావాలని కోరుకున్నాడని కిషోర్‌కుమార్ రెడ్డి అన్నారు. అందుకే కాంగ్రెస్‌లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సహా అందరూ సీఎంలతో గొడవలు, అసమ్మతి ఆయనకు మాములేనంటూ ఎద్దేవా చేశారు.వైసీపీలో ఇక సీఎం అవటం సాధ్యం కాదని పెద్దిరెడ్డికి అర్ధమైందన్నారు. ఆ బాధతోనే ఏం మాట్లాడాలో తెలియక చంద్రబాబు గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. అన్ని రకాల అక్రమాలతో కోట్లకు కోట్లు సంపాదించాడు. ఆ గర్వంతో కన్ను మిన్ను కనబడటం లేదని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పెద్దిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
Read Also: సెక్రటేరియట్ పనులన్నీ వేగంగా సాగాలి : కేసీఆర్
పెద్దిరెడ్డి రైతుల రక్తం తాగుతున్నాడు : పుంగనూరు టీడీపీ ఇన్చార్జ్, చల్లాబాబు
పెద్దిరెడ్డి రైతుల రక్తం తాగుతున్నారని పుంగనూరు టీడీపీ ఇన్ చార్జ్ చల్లాబాబు అన్నారు. కిషోర్‌కుమార్‌రెడ్డి మాట్లాడిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు. మార్కెట్లో లీటర్‌కు రూ. 31 ఇస్తుంటే, పెద్దిరెడ్డి డెయిరీకి పాలు పోసిన పాడి రైతులకు కేవలం లీటర్‌కు 18 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. దౌర్జన్యంగా పాడి రైతుల నుంచి పాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ దుర్మార్గాన్ని రైతుల పక్షాన తాము నిలదీస్తామని చల్లాబాబు పేర్కొన్నారు.