NTV Telugu Site icon

Karumuri Nageswara Rao: చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలి.. జగన్‌ను మళ్లీ సీఎం చేయాలి

Karumuri On Cbn

Karumuri On Cbn

Karumuri Nageswara Rao Fires On Chandrababu Naidu: గుంటూరు మిర్చి యార్డులో నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, అంబటి రాంబాబు, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఆసియాలో అతి పెద్దదైన మిర్చి యార్డు చైర్మన్ పదవి మంత్రి పదవి కంటే పెద్దదని పేర్కొన్నారు. అలాంటి పదవిని సీఎం జగన్ బీసీలకు కేటాయించారన్నారు. గతంలో చంద్రబాబు కలెక్టర్ల మీటింగ్‌లో మా కులం వాళ్ళకు పని చేయమని ఆదేశాలు ఇచ్చేవాడని.. కానీ జగన్ మాత్రం ఎస్సీ, బీజీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారికి మేలు చేయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

Byreddy Siddharth Reddy: సినిమాల్లో పొలిటికల్ డైలాగ్స్, పాలిటిక్స్‌లో సినిమా డైలాగ్స్.. అందుకే రెండు ఎత్తిపోయాయి

పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి వాలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి కారుమూరి మండిపడ్డారు. పథకాల కోసం మన ఇంటి మహిళలు ఆఫీసుల చుట్టూ తిరగాలా? అని ప్రశ్నించాలి. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న కుట్రల్ని తిప్పికొట్టాలన్నారు. చంద్రబాబు హయాంలో పేదవారు ఇంజనీరింగ్ కాలేజీలో చదివారా? అని నిలదీశారు. అప్పట్లో వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో, ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో పేదవారు ఇంజనీర్లు అవుతున్నారని పేర్కొన్నారు. దాచుకో, దోచుకో, పంచుకో పరిస్థితి నుండి.. వాలంటీర్ వ్యవస్థ ద్వారా సీఎం జగన్ ప్రతి కుటుంబానికి చేరువయ్యాడన్నారు. సీఎం జగన్ విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చారన్నారు. దేశంలో విద్యావ్యవస్థలో మన రాష్ట్రం మూడో స్థానంలో ఉందని.. అలాంటి జగన్‌ను మళ్లీ సీఎం చేయాలని పిలుపునిచ్చారు.

Undavalli Arun Kumar: పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు.. ఇంకా పునాదుల్లోనే ఉంది