NTV Telugu Site icon

Kanna Lakshmi Narayana: సీఎం జగన్‌కు కన్నా బహిరంగ లేఖ..

Kanna Lakshmi Narayana

Kanna Lakshmi Narayana

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు బీజేపీ సీనియర్‌ నేత కన్నా లక్ష్మీనారాయణ… కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తన లేఖలో డిమాండ్ చేసిన ఆయన.. 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 5 శాతం కాపులకు కేటాయించాలని లేఖలో సీఎం జగన్‌ను కోరారు.. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో దీనిపై బిల్లు పాస్ చేశారని తన లేఖలో ప్రస్తావించిన కన్నా… రిజర్వేషన్ల అంశంపై 2019 జులైలో కూడా తాను లేఖ రాసినట్లు స్పష్టం చేశారు.. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. కాపులు ఆర్థికంగా వెనుకబడిన విషయాన్ని మంజునాథ కమిషన్ కూడా చెప్పిందని గుర్తుచేశారు. కాపుల రిజర్వేషన్లు కల్పించాలనేది దీర్ఘకాలిక డిమాండ్‌.. త్వరగా దాన్ని అమలు చేయాలని కోరుతున్నానంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.

Read Also: Flex Banners: ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం వాయిదా.. కారణం ఇదే..

కాగా, ఈ మధ్యే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై హాట్‌ కామెంట్లు చేశారు కన్నా లక్ష్మీనారాయణ.. మంత్రిగా అనేక దఫాలుగా పనిచేసిన కన్నా.. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా ఇబ్బందులు పడ్డారు.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇలా.. వారి కేబినెట్‌లలో మంత్రిగా పనిచేశారు.. ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత బీజేపీలో చేరారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.. ఆ తర్వాత సోము వీర్రాజు అధ్యక్షుడిగా నియమితులు కాగా.. ఈ మధ్యే సోము వీర్రాజు పనివిధానంపై కన్నా అసంతృప్తి వ్యక్తం చేశారు.. పార్టీని నడిపే విషయంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. తమతో పొత్తులో ఉన్న జనసేనతో సమన్వయం చేసుకోవడంలోనూ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని.. ఈ భావన ఇప్పటిదాకా తన మనసులోనే ఉంది.. ఇప్పుడు బయటకు వచ్చిందంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆయన బీజేపీని వీడతారనే ప్రచారం జోరుగా సాగగా.. ఇప్పుడు బీజేపీ లెటర్‌ ప్యాడ్‌పైనే సీఎం జగన్‌కు లేఖ రాశారు కన్నా లక్ష్మీనారాయణ.

Show comments