Pitapuram Municipal Results: పిఠాపురంలో సత్తా చాటిన రెబల్స్.. ఏకంగా 7 వార్డుల్లో విజయం..!

Pithapuram

Pithapuram

Pitapuram Municipal Results: కాకినాడ జిల్లాలోని పిఠాపురం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో రెబల్ అభ్యర్థులు సత్తా చాటారు. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో మొత్తం ఏడు వార్డులను స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన రెబల్స్ కైవసం చేసుకున్నారు. వీరిలో ఐదుగురు జనసేన రెబల్ అభ్యర్థులు కాగా, ఇద్దరు వైసీపీ రెబల్ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే, పిఠాపురం మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా, ఇప్పటివరకు 27 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో జనసేన పార్టీ 14 వార్డులను గెలుచుకుంది. ఇందులో 11 వార్డుల్లో విజయం సాధించగా, మరో మూడు వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థులు (రెబల్స్) ఏడు వార్డుల్లో గెలుపొందారు. ఇక తెలుగుదేశం పార్టీ నాలుగు వార్డుల్లో విజయం సాధించగా, బీజేపీ ఒక వార్డు, వైసీపీ ఒక వార్డును కైవసం చేసుకున్నాయి. మొత్తంగా ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో జనసేన ఆధిక్యం కొనసాగుతుండగా, రెబల్ అభ్యర్థులు కూడా గణనీయమైన ప్రభావం చూపారు. అయితే, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గం కావడంతో పిఠాపురం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా గమనిస్తున్నారు..