MLC Anantha Babu Arrest: బిగ్ బ్రేకింగ్.. ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Anantha Babu Arrest: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. రాజమండ్రిలోని తూర్పు గోదావరి జిల్లా కోర్టు వద్ద అనంతబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు, అనంతరం కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఈ ఘటనతో కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు రాజమండ్రి కోర్టుకు ఎమ్మెల్సీ అనంతబాబు తన భార్య లక్ష్మీ దుర్గతో కలిసి హాజరయ్యారు. విచారణ అనంతరం బయటకు వస్తుండగా ముందుగా సిద్ధంగా ఉన్న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఈ అరెస్టు సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Also: CSK History: సరికొత్త చరిత్ర సృష్టించిన సీఎస్‌కే.. ఐపీఎల్ చరిత్రలోనే..!
Also Read
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
దళిత యువకుడు, తన డ్రైవర్‌గా పనిచేసిన వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుతో సంబంధం ఉన్న మరో కేసులో అనంతబాబును అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా ఈ కేసులో సాక్షులను బెదిరించిన ఆరోపణలపై కాకినాడ సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఇప్పటికే వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కేసులో అనంతబాబు గతంలోనూ అరెస్టయ్యారు. తాజాగా అదే కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయడం, బెదిరించడం వంటి ఆరోపణలతో రెండోసారి అరెస్టు కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతబాబు అరెస్టుతో జిల్లాలో రాజకీయ వర్గాల్లో చర్చలు జోరందుకున్నాయి. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!