LPG Cylinder Shortage: రేపు సాయంత్రం వరకే గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి.. ఎల్లుండి నుంచి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Cylinder Shortage: యుద్ధ ప్రభావం గ్యాస్‌ను తాకింది.. ఇప్పటికే కొన్ని దేశాల్లో పెట్రో, గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి.. భారత్‌లోనూ కమర్షియల్‌తో పాటు వంట గ్యాస్ ధరలను కూడా పెంచేశారు.. ఇక, వంట గ్యాస్‌కు ప్రాధాన్యత ఇస్తూనే.. కమర్షియల్ గ్యాస్‌కు కోత పెడుతున్నారు.. దీంతో, ఇప్పటికే పలు సిటీల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే పరిస్థితి వచ్చింది.. ఆంధ్రప్రదేశ్‌లోనూ కొన్ని ప్రాంతాలకు గ్యాస్ కొరత ఎఫెక్ట్ తాకింది.. ఇక, కాకినాడలో గ్యాస్ సిలిండర్ల కొరతపై హోటల్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని హోటల్స్ మరియు స్టార్ హోటల్స్ వద్ద ప్రస్తుతం ఉన్న గ్యాస్ సిలిండర్లు రేపు సాయంత్రం వరకు మాత్రమే సరిపోతాయని హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
రేపటి తర్వాత పరిస్థితి అనిశ్చితం
హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎన్టీవీతో మాట్లాడుతూ, ఎల్లుండి నుంచి గ్యాస్ సిలిండర్ల పరిస్థితి ఎలా ఉంటుందో తమకు స్పష్టంగా తెలియడం లేదన్నారు. ఒకవైపు మంత్రి గ్యాస్ సిలిండర్ల కొరత లేదని చెబుతున్నప్పటికీ, మరోవైపు ఏజెన్సీలు మాత్రం ఎమ్మార్వోలు గ్యాస్ సిలిండర్లు ఇవ్వొద్దని చెప్పారని తమకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. గ్యాస్ సరఫరా నిలిచిపోతే హోటల్స్ నిర్వహించడం చాలా కష్టమవుతుందని యజమానులు అంటున్నారు. అవసరమైతే కట్టెల పొయ్యులు, పుల్లలు ఉపయోగించి హోటల్స్ నడపాల్సిన పరిస్థితి కూడా రావచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
పెళ్లిళ్ల సీజన్‌లో క్యాటరింగ్ ఇబ్బందులు
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలా క్యాటరింగ్ ఆర్డర్లు ఇప్పటికే తీసుకున్నామని హోటల్ యజమానులు తెలిపారు. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోతే ఆ ఆర్డర్లను ఎలా నిర్వహించాలో అర్థం కావడం లేదని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే మొదట హాఫ్ డే మాత్రమే హోటల్స్ నడపాల్సి వస్తుందని, పరిస్థితి మారకపోతే చివరికి హోటల్ ఇండస్ట్రీ పూర్తిగా మూసివేయాల్సి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హాస్పిటల్స్ మరియు హాస్టల్స్‌కు మినహాయింపులు ఇచ్చినట్లే హోటల్స్‌కు కూడా గ్యాస్ సరఫరాలో మినహాయింపు ఇవ్వాలని హోటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది..
తాజావార్తలు
-
Top 7 Indian Sequels: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 7 సీక్వెల్స్ ఇవే!
-
Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
-
Pickaxe Mountain: ‘త్వరలో పికాక్స్ పర్వతంపై దాడి చేస్తాం’ ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Teachers Day 2026: ఈ రోజే టీచర్స్ డే.. గురువు గొప్పతనం ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఒక్క కథ చాలు!
-
POCO X8, X8 Power: పోకో ఎక్స్8 పవర్, పోకో ఎక్స్8 భారత్‌లో లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్, ధరలు ఇవే!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!