Daaku Maharaaj: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని నాగవంశీ సాయి సౌజన్యతో కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమాకి మొదటి ఆట నుంచి సూపర్ సక్సెస్ టాక్ వస్తోంది. సినిమాలో నందమూరి బాలకృష్ణకి ఒక రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా అదిరిపోయింది అని అంటున్నారు సెకండ్ హాఫ్ విషయంలో కొన్ని కంప్లైంట్స్ ఉన్నా సరే సినిమా టాక్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గేది లేదని దూసుకు పోతోంది. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ నిర్వహించింది సినిమా యూనిట్. ఈ సందర్భంగా అనంతపురంలో నిర్వహించలేకపోయిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మరోసారి సక్సెస్ మీట్ పేరుతో నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ బాలకృష్ణ కాల్ చేసి తనను కంగ్రాట్యులేట్ చేశాడని, మొన్న ఈవెంట్ నిర్వహించలేక యూనిట్ గురించి సరిగా మాట్లాడలేకపోయాం. ఈసారి మీరు ఎక్కడంటే అక్కడ ప్లాన్ చేయండి నేను వస్తాను అని ఆయనే ఓపెన్ ఆఫర్ ఇచ్చారని అన్నారు. ఈ క్రమంలోని నాగ వంశీ మాట్లాడుతూ ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ అనంతపురంలో నిర్వహించడానికి సిద్ధమయ్యామని త్వరలోనే ఈ మేరకు ప్రకటన చేస్తామని అన్నారు.