Deputy CM Pawan Kalyan: కాకినాడకు పవన్ కల్యాణ్.. నేడు ఉప్పాడలో బహిరంగ సభ..
- నేడు కాకినాడలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన..
- దివీస్ ఫార్మా కంపెనీ రసాయనాల కాలుష్యంతో...
- మత్స్య సంపద క్షీణిస్తుందని గత కొన్ని రోజులుగా మత్స్యకారుల ఆందోళన..
- మత్స్యకారుల సమస్యలను తెలుసుకోనున్న పవన్ కల్యాణ్..
- సముద్ర కాలుష్యం, మత్స్యకారుల సమస్యలు, ఉప్పాడ తీరం కోత వంటి అంశాలపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు.. పవన్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ముందుగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రాజమండ్రి విమానాశ్రయం చేరుకోనున్న పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి హెలికాప్టర్లో కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్తారు. ఆ తరువాత నేరుగా కాకినాడ కలెక్టరేట్‌కు చేరుకుంటారు. దివీస్ ఫార్మా కంపెనీల నుంచి విడుదలయ్యే రసాయనాలతో ఉప్పాడ సముద్ర తీరం కలుషితమవుతోందని.. మత్స్య సంపద క్షిణించి జీవనోపాధి కోల్పోపోతున్నామని గత కొంత కాలంగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే కలెక్టరేట్లో మత్స్యకార సంఘాల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీతో సమావేశమై.. సముద్రంలో కాలుష్యం, నష్టపరిహారం చెల్లింపు, మత్స్యకారుల సమస్యలు, ఉప్పాడ తీరం కోతకు గురికావడం వంటి అంశాలపై చర్చిస్తారు పవన్ కల్యాణ్.
Read Also: YS Jagan: నేడు ఉమ్మడి విశాఖ జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన.. అప్రమత్తమైన పోలీసులు
Also Read
- Botsa Satyanarayana : పవన్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్.. రాజ్యాంగ పదవికి అర్హుడా.?
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
మత్స్యకారులతో సమావేశం ముగిసిన తరువాత స్థానిక జనసేన నాయకులతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఉప్పాడ చేరుకుంటారు జనసేనాని పవన్. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4.10 గంటలవరకూ ఉప్పాడ సెంటర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఉప్పాడలో బహిరంగసభలో మత్స్యకారుల భరోసా కల్పించేలా మాట్లాడనున్నారు. పవన్ పర్యటన దృష్ట్యా.. ఎలాంటి ఘటనలు జరగకుండా 550 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఏఎస్పీ, ముగ్గురు డీసీపీలతో సహా 550 మందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.. మరోవైపు, కలెక్టరేట్లో కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు..
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!