Deputy CM Pawan Kalyan: పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు.. సంతోషం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్..
- పిఠాపురంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి..
- పాలనపరమైన అనుమతి లభించడం స్పందించిన పవన్ కల్యాణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాతో పాటు కీలక శాఖలను సొంతం చేసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన శాఖల పరిధిలో కీలక సంస్కరణలపై దృష్టి పెడుతూనే.. మరోవైపు.. తను అసెంబ్లీలో అడుగుపెట్టేలా ఆశీర్వదించిన పిఠాపురం నియోజకవర్గంపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేశారు.. ఇక, పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు పడింది.. రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు వచ్చాయి.. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సంతోషాన్ని వ్యక్తం చేశారు..
Also Read
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
పిఠాపురం ప్రాంతంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి రూ. 59.70 కోట్లు మంజూరు చేసి, పాలనపరమైన అనుమతి లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు పవన్ కల్యాణ్.. ఎన్నికల సమయంలో నేను ఈ వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చాను. సామర్లకోట – ఉప్పాడ రహదారిలో రైల్వే క్రాసింగ్ కారణంగా ప్రజలు రోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత రాకపోకలు సులభతరం అవుతాయి, ప్రజల ప్రయాణ సమయం ఆదా అవుతుందని తెలిపారు.. ఈ రహదారి కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (CRIF) సేతు బంధన్ పథకంలో భాగంగా చేపడుతున్నాం అన్నారు.. ఇక, ఈ ఆర్వోబీకి నిధులు మంజూరు చేసి అండగా నిలిచిన ప్రధాని మోడీ, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు డిప్యూటీ సీఎం.. ఈ వంతెన త్వరగా ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆశిస్తున్నాను అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు – రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి
పిఠాపురం ప్రాంతంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి ₹59.70 కోట్లు మంజూరు చేసి, పాలనపరమైన అనుమతి లభించడం ఎంతో ఆనందంగా ఉంది.
ఎన్నికల సమయంలో నేను ఈ వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చాను.…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 26, 2025
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
-
Asian Games 2026 Shooting: ఏషియన్ గేమ్స్ 2026లో భారత షూటర్ల హవా.. స్వర్ణంతో మెరిసిన కమల్జీత్- సురుచి
-
Suchika Tariyal: ఆ రోజు జరిగిన అవమానమే.. ఈ రోజు దేశం గర్వించే పతకంగా మారింది! సుచికా గూస్బంప్స్ స్టోరీ!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!