Deputy CM Pawan Kalyan: పిఠాపురంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు.. అడపడుచులకు డిప్యూటీ సీఎం అదిరిపోయే గిఫ్ట్‌లు..
- తన నియోజకవర్గంలోని ఆడపడుచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహుమతులు..
- ఈ రోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు..
- 12 వేల చీరలను ఆడపడుచులకు పంపించిన పవన్ కల్యాణ్..
- పురూహూతికా దేవాలయంలో వరలక్ష్మి వ్రతాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపై అందరి ఫోకస్ ఉంది.. దానికి అనుగుణంగా.. పవన్ కల్యాణ్ కూడా తన నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.. ఓవైపు తనకు కేటాయించిన శాఖలపై పట్టుకోసం ప్రయత్నాలు చేస్తూనే.. నియోజకవర్గంలోనూ క్షేత్రస్థాయిలో పర్యటించారు.. అంతేకాదు.. ఆ నియోజకవర్గంలోని ఆడపడుచుల మనసులు గెలుచుకునేందుకు ఏపీ డిప్యూటీ సీఎం.. శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగా శ్రావణ మాసంలో చివరి శుక్రవారం అయిన ఈ రోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు.. ఈ సందర్భంగా.. 12 వేల చీరలను పిఠాపురంలోని ఆడపడుచులకు పంపించారు పవన్ కల్యాణ్.. అయితే, ప్రతీ ఏడూ శ్రావణమాసం చివరి శుక్రవారం రోజున పిఠాపురంలోని పురూహూతికా దేవాలయంలో పెద్ద ఎత్తున వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు ఆడపడుచులు.. అదే కోవలో ఈ ఏడాది కూడా సామూహిక వరలక్ష్మి వ్రతాలకు ఏర్పాట్లు చేయగా.. తాను గెలిచిన తర్వాత వచ్చిన తొలి ఈవెంట్ కాబట్టి.. అందరికీ అదిరిపోయే గిఫ్ట్‌లు పంపారు పవన్ కల్యాణ్..
Read Also: Kalki 2898 AD 2: ‘కల్కి 2’ అప్డేట్.. షూటింగ్ ప్రారంభమయ్యేది అప్పుడే!
Also Read
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
అయితే, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశానుసారం సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొనే మహిళలకు పాస్ లు జారీ చేయడం గందరగోళంగా తయారయ్యింది అంటున్నారు.. ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా పాదగయలో జరిగే వరలక్ష్మీ వ్రతాల్లో పాల్గొనే వారందరికి అందించేందుకు వీలుగా 12వేల చీరలను పంపించినట్లు జనసేన వర్గాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు.. ఈ నేపథ్యంలో మహిళలు భారీ సంఖ్యలో పాద గయ క్షేత్రానికి టోకెన్లు కోసం మధ్యాహ్నం నుండి బారులు తీరారు.. అయితే పాదగయలో ఆరువేల మందికి మాత్రమే వ్రతాలు పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు.. వరలక్ష్మి వ్రతాలకు కేవలం ఎనిమిది వందల నుండి వెయ్యి టికెట్లు వరకు ఆలయ సిబ్బంది జారీ చేసి చేతులెత్తేశారు.. టోకెన్లు కోసం మహిళలలు 5 వేలకు పైగా రావడం, టోకెన్లు మాత్రం నామమాత్రంగా జారీచేయడంపై మహిళలు తీవ్రంగా మండిపడ్డారు.. అంతా గందరగోళంగా మారడంతో స్థానికుల్లో ఆగ్రహాన్ని తెచ్చింది. 12 వేలు వ్రతాలకు సంబంధించి చీరలు, పూజ సామాన్లు పంపిణీ కి సిద్ధం చేశామని చెప్పగా , నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు ఉదయం 9గంటలకే వచ్చి క్యూలైన్లుల్లో నిలుచున్నామని. వర్షానికి తడస్తూ, ఉక్కపోతతో సతమవుతూ అయిదు గంటలకు పైగా వేచి చూడాల్సి వచ్చిందని.. అధికారులు మాత్రం తూ తూ మంత్రంగా టోకెన్లు జారీ చేసి చేతులు ఫులుపుకున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదంతా నామమాత్రమేనని.. అన్ని సద్దుకుంటాయని.. సామూహిక వరలక్ష్మి వ్రతాలు విజయవంతంగా సాగుతాయని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!