Site icon NTV Telugu

AP Crime: ప్రియుడితో కలిసి భర్తను లేపేసిన భార్య.. ఆలస్యంగా వెలుగుచూసిన గుట్టు..

Crime

Crime

AP Crime: పచ్చని సంసారాల్లో కొన్ని ఘటనలు చిచ్చు పెడుతున్నాయి.. మరో వ్యక్తి మోజులో పడి.. కట్టుకున్నవారిని కూడా కాటికిపంపిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా మరో ఘటనలో ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది.. కాకినాడ జిల్లా ఏవీ నగరంలో ప్రియుడుతో కలిసి భర్త మధుకి విషంపెట్టి చంపింది భార్య.. స్థానికంగా ఉన్న రిఫరల్ హాస్పిటల్‌లో పనిచేసే మృతుడి భార్యకి.. అక్కడే పనిచేసే ప్రశాంత్‌తో పరిచయం ఏర్పడింది.. అది కాస్తా హద్దులు దాటేసింది.. వివాహేతర సంబంధానికి దారితీసింది.. ఈ విషయం కాస్తా భర్త మధుకు తెలియడంతో.. ఆ కుటుంబంలో గొడవలు మొదలైనట్టుగా తెలుస్తోంది.. అయితే, తమ బంధానికి అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడుతో కలిసి మర్డర్ ప్లాన్ చేసింది.. తన ప్లాన్‌లో భాగంగా భర్తకు ఈ నెల 19వ తేదీన విషయం పెట్టి చంపేసింది.. అది సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.. అయితే, మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు.. కానీ, పోలీసుల విచారణలో అసలు గుట్టు బయటపడింది.. ప్రియుడితో కలిసి.. ప్లాన్‌చేసి.. కట్టుకున్న భర్తను భార్యే మట్టుబెట్టినట్టుగా తేల్చారు పోలీసులు..

Read Also: Icon Star : పుష్ప -2 కోసం నేషనల్ మీడియా హైదరాబాద్ రాక

Exit mobile version