ఆషాఢ మాసం పూర్తయి శ్రావణ మాసం ప్రారంభం అయింది. అన్ని దేవాలయాల్లో పూజలు ఊపందుకున్నాయి. కడప జిల్లా చక్రాయపేట మండలంలో వెలసిన శ్రీ గండి వీరాంజనేయ స్యామి పుణ్యక్షేత్రంకు ఎంతో చారిత్రక నేపథ్యంలో వుంది. కడప జిల్లా నలుమూలల నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. శ్రావణమాస వేడుకల విషయంలో గండి క్షేత్రం జిల్లా లో ప్రథమ స్థానంలో నిలుస్తుంది.
Musi Flood : 1908లో హైదరాబాద్ వరదలు ఓ చీకటి అధ్యాయం
నేటి నుంచి వేడుకలు ప్రారంభమై ఆగస్టు 27 న ముగుస్తుయి. శనివారాలలో ఈ క్షేత్రానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. మూడవ, నాలుగోవ, ఐదవ శనివారాలలో గండి క్షేత్రం ప్రాంతమంతా జనసంద్రంగా మారుతుంది. శ్రావణమాసొత్సవాలు ప్రారంభం కావడంతో అందుకు సంబంధించిన పనులు వేగంగా పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆలయ కమిటీ అధికారులు తెలిపారు.
స్వామి వారి అలంకరణకు అవసరమైన పువ్వులను ప్రత్యేకంగా తమిళనాడు నుంచి తెప్పించుకుని అలంకరణ చేస్తామని గండి ప్రధాన అర్చకులు కేసరి స్వామి, రాజా స్వామి తెలిపారు. అంతేగాక రాత్రి వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పారు. భారీగా పోలీసు బందోబస్తుతో పాటు, ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వాలంటీర్లుగా పని చేయనున్నారు. భక్తులకు ముఖ్యంగా త్రాగు నీరు, స్నానపు గట్టాలు, రేకుల షెడ్డు, దాతల సహకారంతో నిత్యా అన్నదానం చేయబోతున్నామని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు ఎంతమంది వచ్చినా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామన్నారు.
Telangana BJP Politics : ఆ నాయకుడు ముఖ్య నేతల ఇంటికి వెళ్లి బ్రేక్ ఫాస్ట్, భోజనం చేయడం వెనుక కారణం ఏంటి..?