KA Paul: ఎన్నికల సమయం వచ్చేసింది. రాజకీయ పార్టీలు తమ తమ పార్టీలను గెలిపించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఏ చిన్న అవకాశం వచ్చినా ప్రత్యర్థులపై మాటల తూటాలను విసిరేస్తున్నారు. ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీల కన్నుమొత్తం ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మీదనే ఉంది. విశాఖలో గెలవాలి అంటే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపాలి. దానికోసం ఎవరివంతు కృషి వారు చేస్తున్నారు. ఇక తాజాగా ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సైతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మీడియా సమావేశం పెట్టి మరీ మాట్లాడారు. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణతో కలిసి విశాఖపట్నంలో ఆయన మీడియా తో మాట్లాడారు. ఈ సమావేశంలో పాల్.. పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. అంతేకాకుండా పవన్ కు మంచి ఆఫర్ కూడా ఇచ్చారు.
“ఎవరికో పవన్ కళ్యాణ్ కు ఓట్లు వేయొద్దు.. తమ్ముడు నువ్వు కూడా రా.. జాయిన్ అవ్వు.. ఎందుకు నీకు బీజేపీ.. బీజేపీతో పొత్తులెందుకు. అదే బీజేపీని తిట్టి బీఎస్పీలో చేరావు కదా. 2019 లో ఎలెవెన్స్ పెట్టుకున్నావు కదా. మరలా అదే బీజేపీకి ఎందుకు వెళ్ళావ్. నువ్వు వెళితే ఢిల్లీలో వాళ్లు కలుస్తున్నారా..? నీకు రోడ్డు మ్యాప్ ఇస్తానని నాలుగేళ్లుగా చెప్తున్నారు.. ఇచ్చారా..? ఏంటా.. బతుకు.. రాజీనామా చేసేసి ఆస్ట్రేలియా వెళ్తాను అన్నావ్ వెళ్ళిపో.. లేదా మీ పార్టీని మా పార్టీలో విలీనం చెయ్. ఒక నీతి, నిజాయితీ ఉన్న ఏకైక పార్టీ .. ప్రజాశాంతి పార్టీ. ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. ఎవరితో కాంప్రమైజ్ కాలేదు. మోదీ అడిగితే డబ్బులు ఇచ్చా.. చంద్రబాబు, కేసీఆర్ అడిగితే డబ్బులు ఇచ్చా..వారు అడగడం మీరందరూ చూసారు. నాకు పాదపూజ చేసి, శాలువాలు కప్పి, డబ్బులు అడిగారు. ఇచ్చేవాడిని మీకు నేనున్నా.. వాళ్ళు సినిమాలో హీరోస్.. నేను రియల్ హీరో” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పాల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
పవన్ కళ్యాణ్ ఏం బతుకు నీది.. రాజీనామా చేసి ఆస్ట్రేలియాకి పో..!
FULL VIDEO >>>https://t.co/jzHZmhvQx6#KAPaul #LakshmiNarayana #CBI #VizagSteelPlant #Visakhapatnam #CMKCR #CMYSJagan #YSJagan #NarendraModi #Pawankalyan #KCR #NTVTelugu pic.twitter.com/NalvseHWfw
— NTV Telugu (@NtvTeluguLive) April 20, 2023