NTV Telugu Site icon

KA Paul: పవన్.. రాజకీయాల నుంచి తప్పుకో లేదా నా పార్టీలో చేరు

Ka Paul On Pawan Kalyan

Ka Paul On Pawan Kalyan

KA Paul Demands Pawan Kalyan To Quit Politics: జనసేనాధిపతి పవన్ కళ్యాణ్‌ను రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిందిగా ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఒకవేళ రాజకీయాల నుంచి తప్పుకోకపోతే.. తన పార్టీలోకి చేరాలని కోరారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అనంతపురంలో మాట్లాడిన కేఏ పాల్.. చంద్రబాబు, జగన్‌లు కలిసి ఏపీ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపణలు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ పెయిడ్ కార్యక్రమాలు చేస్తుంటారని వ్యాఖ్యానించారు. జేడీఏ లక్ష్మీనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారు జనసేనలోకి వెళ్లరని అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్‌ను ఎందుకు ఓట్లు చీలుస్తున్నారని ప్రశ్నించారు.

Sitara Ghattamaneni: మహేష్ కూతురుతో కలిసి రమేష్ కూతురు అరాచకం

ఇక రాష్ట్ర ప్ఱభుత్వం తీసుకొచ్చిన జీఓ నం.1ని తాను స్వాగతిస్తున్నానని కేఏ పాల్ అన్నారు. సందుల్లో మీటింగ్‌లో ఎలా పెడతారని ప్రశ్నించిన ఆయన.. ఒకవేళ వైసీపీ నేతలు సందుల్లో సభలు పెట్టినా తాను అడ్డుకుంటానని తేల్చి చెప్పారు. జీఓ నం.1ను సస్పెండ్ చేయడాన్ని తప్పుబట్టిన ఆయన.. అది ప్రాణాలు కాపాడే జీవో అని పేర్కొన్నారు. జీఓ సస్పెండ్ చేసింది న్యాయమూర్తి అయినా సరే తాను తప్పుబడుతున్నానన్నారు. ఈ జీఓ మూడేళ్ల క్రితమే రావాల్సిందని, కానీ ఆలస్యమైందని చెప్పారు. తాను అధికారంలోకి వస్తే.. 6 నెలల్లోనే అప్పులు తీర్చి, లక్ష ఉద్యోగాలు తెస్తానని హామీ ఇచ్చారు. అంతవరకు నా పాస్ పోర్టు, గ్రీన్ కార్డ్ కోర్టుకు సబ్మిట్ చేస్తానన్నారు.

Afghanistan Taliban: మాకు ఇస్లామిక్ చట్టమే ముఖ్యం.. మహిళల హక్కులు కాదు

సంక్రాంతి రోజు చాలా బాధతో తాను మాట్లాడుతున్నానని.. ఎంతోమంది కనీసం రూ. 100 కూడా లేక చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెయ్యి రూపాయలు లేక సొంత ఊళ్లకు వెళ్లలేకపోతున్నారని వాపోయారు. పండుగ వేళ కొత్త బట్టలు కొనేందుకు డబ్బులు లేని పరిస్థితి ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉందన్నారు. కియా వచ్చినప్పుడు చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి, మోసం చేశారన్నారు. రాష్ట్రంలో 30 శాతం నిరుద్యో సమస్య పెరిగిందన్నారు.

Tollywood: హీరోలు.. అసలు సంక్రాంతి జోరు ఏదయ్యా..?