Taliban Spokesperson Zabihullah Mujahid Says Women Rights Are Not Priority: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం మహిళల పట్ల ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో అందరికీ తెలిసిందే! హైస్కూల్, కాలేజీ, యూనివర్సిటీల్లో చదవకుండా అమ్మాయిలపై నిషేధం విధించింది. అంతేకాదు.. మహిళలు ఎన్జీవోల్లో కూడా పని చేయకుండా కొత్త రూల్ తీసుకొచ్చింది. హిజాబ్ ధరిచంకుండా, మగ తోడు లేకుండా బయటకు వెళ్లొద్దన్న నిబంధనల్ని సైతం తీసుకొచ్చింది. దీంతో.. తాలిబన్ ప్రభుత్వం తీరును ప్రపంచ దేశాలు తప్పుబడుతున్నాయి. మహిళల హక్కులను కాలరాయొద్దని, పురుషులకు సమానంగా వారికీ హక్కులు కల్పించాలని సూచిస్తున్నాయి. అటు.. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న పురుషులు సైతం తాలిబన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం ఎత్తుతున్నారు. తమ చెల్లెలు, అక్కలకు లేని చదువు.. తమకు కూడా వద్దంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
Nepal PM India Tour: త్వరలో భారత్‌లో పర్యటించనున్న నేపాల్ ప్రధాని!
ఈ దెబ్బకు తాలిబన్ ప్రభుత్వం దిగొస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, తాము తగ్గేదేలేదని తాలిబన్ ప్రభుత్వం పేర్కొంటోంది. తాలిబన్ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. తమకు ఇస్లామిక్ చట్టమే ముఖ్యమని, దాని ప్రకారమే మమిళలు నడుచుకోవాలని పేర్కొన్నాడు. అసలు మహిళల హక్కులు తమ ప్రాధాన్యమే కాదని కుండబద్దలు కొట్టాడు. మహిళలపై విధించిన ఆంక్షలను ఎత్తివేసే ఉద్దేశమే తమకు లేదని, ఇస్లాం చట్ట ప్రకారమే తమ పాలన కొనసాగుతుందని తేల్చి చెప్పాడు. కాగా.. శుక్రవారం 11 దేశాలు మహిళలు, అమ్మాయిలపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేయాలని తాలిబన్ ప్రభుత్వాన్ని కోరాయి. ఐక్యరాజ్య సమితి కూడా మహిళల హక్కుల పరిమితిపై ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై ఆఫ్ఘనిస్తాన్ స్పందిస్తూ.. ఇస్లామిక్ షరియా చట్టాన్ని ఉల్లంఘించే చర్యలను అనుమతించలేమని తాలిబాన్ ప్రభుత్వం శనివారం తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ సాంప్రదాయ సమాజంలో మతపరమైన డిమాండ్లను అర్థం చేసుకోవాలని, రాజకీయాలకు మానవతావాద సహాయాన్ని ముడిపెట్టవద్దని ముజాహిద్ కోరారు.
VD12: రామ్ చరణ్ కు సెట్ కాలేదు విజయ్ కు సెట్ అవుతుందా..?
ఇదిలావుండగా.. ఆగస్ట్ 2021లో తాలిబన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళల హక్కుల్ని కాలరాస్తోంది. మహిళల విద్య, పని, ఉద్యమంపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. ప్రస్తుతం ఆ దేశంలో అమ్మాయిలు ఆరవ తగరతికి మించి పాఠశాలకు వెళ్లలేరుచ విశ్వవిద్యాలయ విద్యను పొందలేరు. జాతీయ, అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థలతో సహా అనేక కార్యాలయాల్లో పని చేయడం నిషేధించబడింది. ప్రపంచదేశాలు నుంచి తీవ్ర విమర్శలు ఎదరువుతున్నా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకెళ్తోంది.